Homeసినిమా వార్తలుతమన్నా 'నవంబర్ స్టోరీ' ట్రైలర్

తమన్నా ‘నవంబర్ స్టోరీ’ ట్రైలర్

మిల్కీ తమన్నా నటించిన తొలి వెబ్ సీరీస్ ‘నవంబర్ స్టోరీ’. అయితే దీనికంటే ముందు తను నటించిన రెండో సీరీస్ ’11th అవర్’ విడుదలైంది. ‘నవంబర్ స్టోరీ’ కూడా ఈ నెల 20 నుంచి తమిళ, తెలుగు, హిందీ భాషల్లో హాట్ స్టార్ లో విడుదల కానుంది. తాజాగా ఈ వెబ్ సీరీస్ ట్రైలర్ ను విడుదల చేశారు. మర్డర్ మిస్టరీగా తెరకెక్కిన ఈ సీరీస్ ట్రైలర్ ఆకట్టుకుంటోంది. ఈ సీరీస్ లో తమన్నా క్రైమ్ నవలా రచయిత గణేశన్ కుమార్తె అనురాధ పాత్రను పోషించింది. అనుకోకుండా తమన్నా ఇంటిలో ఓ మర్డర్ జరుగుతుంది.

 

పెన్ తో 47 సార్లు పొడిచి హత్యచేయటమే కాకుండా బాడీపై పెయింట్ పులమటంతో ఎలాంటి క్లూ లభించకుండా పోతుంది. పోలీసులు తమన్నా తండ్రి ఈ క్రైమ్ రచయిత ఈ హత్య చేశాడని అనుమానిస్తారు. మరి నిజమైన హంతకుడెవరో కనిపెట్టి తన తండ్రిని తమన్నా కాపాడుకుంటుందా? లేదా? అన్నదే ఈ సీరీస్ కథాశం. తెలుగు వెబ్ సీరీస్ ’11th అవర్’లో నటనతో ఆకట్టుకున్న తమన్నా ఈ సీరీస్ తో విజయాన్ని కూడా సొంతం చేసుకుంటుందేమో చూడాలి.

Related Articles

Telugu Articles

Movie Articles