Tamanna important role in Chiranjeevi sye raa movie
Tamanna important role in Chiranjeevi sye raa movie

సైరా పుణ్యమా అని తమన్నాకి మరో ఐదారేళ్ళు హీరోయిన్ అవకాశాలు వచ్చేలా ఉన్నాయి. మెగాస్టార్‌ చిరంజీవి ప్రధాన పాత్రలో ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవితం ఆధారంగా రానున్న ‘సైరా నరసింహారెడ్డి’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న సంగతి తెలిసిందే. అయితే ఈ సినిమాలో తమన్నా రోల్ కూడా కీలకమైనదట. ఇందులో ఆమె ఒక నృత్యకారిణి పాత్ర చేసింది. ట్రైలర్లో ప్రధాన హీరోయిన్ నయనతారతో సమానంగా తమన్నా చెప్పిన డైలాగ్స్, ఎమోషనల్, ఇంటెన్స్ షాట్స్ చూస్తే కథలో ఆమె పాత్రకు మంచి ప్రాధాన్యం ఉందని అర్థమవుతోంది.

మొదట సినిమాలో తమన్నా నటిస్తుందని కన్ఫర్మ్ అవగానే ఏదో చిన్న పాత్ర అయ్యుంటుందని, మహా అయితే ఒక పాట కోసం తీసుకుని ఉంటారని అంతా అనుకున్నారు. కానీ ట్రైలర్ లో పోస్టర్స్ లో చూస్తుంటే మిల్కీ బ్యూటీ పాత్ర పెద్దదని, ఆమెకు, చిరుకు మద్య బలమైన ట్రాక్ ఉంటుందని, ఆమె కూడా యుద్ద సన్నివేశాల్లో ఉంటుందని అర్థమవుతుంది. ఈ సినిమా గనుక మంచి విజయాన్ని అందుకుంటే తమన్నా కెరీర్ మరింత బలపడుతుందనే టాక్ వినిపిస్తోంది.

ఇక తమన్నా సైతం డ్రీమ్ టీంతో కలిసి డ్రీమ్ రోల్ చేశానంటూ సంబరపడిపోతోంది. భారీ అంచనాలతో ఈ చిత్రం అక్టోబరు 2న గాంధీ జయంతి సందర్భంగా తెలుగు, తమిళం, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో విడుదల కానుంది. కాగా ఈ సినిమాలో అమితాబ్ బచ్చన్, సుదీప్, విజయ్ సేతుపతి, జగపతిబాబు, అనుష్క వంటి స్టార్ లు కూడా నటిస్తున్నారు. అందుకే సైరా కోసం తెలుగు ప్రేక్షకులే కాకుండా.. హిందీ, కన్నడ మరియు తమిళ ప్రేక్షకులు కూడా సినిమా పై ఎంతో ఆసక్తిగా ఉన్నారు. ఈ చిత్రంలో నయనతార కథానాయికగా నటిస్తుంది. భారీ బడ్జెట్ తో హీరో రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని భారీ స్థాయిలో విడుదల చేయనున్నారు.