RC15: శంకర్ రామ్ చరణ్ సినిమాలో మరో హీరోయిన్..!

0
5583
Tamannaah key role in Ram charan Shankar RC15 film

Ram Charan RC15: ఆర్ఆర్ఆర్ (RRR Movie) సినిమాతో బిజీగా ఉన్న రామ్ చరణ్ (Ram Charan) మరికొద్ది రోజులలో చిత్ర షూటింగ్ పూర్తి చేసి శంకర్ (Shankar) సినిమా చేయనున్న విషయం తెలిసిందే. ఇండియన్ 2 సినిమా వివాదాన్ని వదిలించుకున్న శంకర్ ఇక నుంచి పర్ఫెక్ట్ ప్లాన్ తో ముందుకు వెళ్లాలని అనుకుంటున్నాడు. వీలైనంత వరకు దిల్ రాజు పై అత్యదిక బడ్జెట్ భారం వేయకుండా సినిమాను చాలా ప్లాన్డ్‌గా తీయాలని భావిస్తున్నాడు.

కొద్ది రోజులుగా సినిమా కాస్టింగ్ ఎంపిక జరుగుతుండగా, ఈ సినిమాలో హీరోయిన్‌గా కియారా అడ్వాణీ చేస్తుందంటూ చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించారు. అంతేకాదు.. దర్శకుడు శంకర్‌తో కలిసి కియారా ఉన్న పిక్‌ని కూడా విడుదల చేశారు. అయితే ఇప్పుడు ఈ సినిమాలో కియారాతో పాటు మరో బాలీవుడ్ స్టార్ హీరోయిన్‌ కూడా నటిస్తోందట.

మరో హీరోయిన్ గా తమన్నాని ఎంపిక చేసినట్టు తెలుస్తుంది. విలన్ భార్యగా తమన్నా నటిస్తోందట. హీరోయిన్ కి సమాంతరంగా ఉన్న పాత్రలో తమన్నా కనిపించి అలరించనున్నట్టు తెలుస్తుంది. విలన్‌కి భార్య అంటే ఆమె రోల్ కూడా కొంచెం నెగెటివ్ షేడ్‌లోనే ఉండొచ్చని ఫ్యాన్స్ భావిస్తున్నారు. కాగా, గతంలో చరణ్‌, తమన్నా జంటగా రచ్చ సినిమాలో నటించిన విషయం తెలిసిందే. మరి దీనిపై క్లారిటీ రావాలంటే అధికారిక సమాచారాం వచ్చే వరకూ ఎదురుచూడాల్సిందే.

 

Previous articleగాంధీ జ‌యంతి సంద‌ర్భంగా సాయి తేజ్ రిప‌బ్లిక్‌..!
Next articleRRR: రిలీజ్ డేట్ పై మళ్లీ కన్ఫ్యూజన్..?