ఆరుపదులు వయసు దాటిన , తమ్ముళ్లు కొడుకులు హీరోలైన ఇంకా వారికి ధీటుగా వరుస పెట్టి సినిమాలు చేస్తూ దూసుకు వెళ్తున్న స్టార్ హీరో మెగాస్టార్. ఈ ఏడాది సంక్రాంతికి విడుదలైన వాల్తేరు వీరయ్య తో తన సత్తాను వరల్డ్ వైడ్ చాటి చెప్పిన చిరంజీవి (Chiranjeevi) ప్రస్తుతం వరస ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. చిరంజీవి కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్గా వాల్తేరు వీరయ్య గుర్తింపు పొందింది. ఈ మూవీ ఇచ్చిన కిక్ తో రెట్టింపు ఉత్సాహంతో మెగాస్టార్ దూసుకుపోతున్నారు.
ప్రస్తుతం చిరంజీవి నటిస్తున్న భోళాశంకర్ (Bhola Shankar) మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. ఈ మూవీని మెహర్ రమేష్ ఎంతో ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు. ఎలాగైనా ఈ మూవీతో మంచి సక్సెస్ ను తిరిగి సాధించాలి అనుకుంటున్నా రమేష్ ఎన్నో జాగ్రత్తలతో చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ప్రస్తుతం ఈ మూవీకి సంబంధించిన షూటింగ్ (Shooting) కోల్కత్తాలో జరుగుతోంది. అయితే ప్రస్తుతం ఏ మూవీకి సంబంధించిన ఓ వార్త బాగా వైరల్ అయింది.
భోళాశంకర్ లో వకీల్ సాబ్ అంటూ.. ఓ గాసిప్ ప్రస్తుతం ఫిలిమ్ నగర్ లో చక్కర్లు కొడుతోంది. ఈ చిత్రంలో తమన్నా భాటియా (Tamannaah) హీరోయిన్ గా నటిస్తున్నారు. తమన్నా ఈ చిత్రంలో లాయర్ పాత్రలో నటిస్తున్నారు అన్న విషయం ఇటీవల లీక్ అయిన కొన్ని ఫోటోలు వల్ల బయటపడింది. అయితే ఈ మూవీలో తమన్నా (Tamannaah Vakeel Saab) వకీల్ సాబ్ మూవీ లోని పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) బాడీ లాంగ్వేజ్ ను అనుకరిస్తుందని తెలుస్తోంది. అంతే కాకుండా ‘అబ్జెక్షన్’ అని కోర్టు సన్నివేశాల సమయంలో చాలాసార్లు తమన్నా డైలాగ్ ఉందట. మొత్తానికి తమన్నా లేడీ వకీల్ సాబ్ లా దర్శనమిస్తుంది అని సమాచారం. తమన్నా కోర్టులో లాయర్ గా కనిపించే సీన్స్ ఎంతో ఆసక్తిగా ఫ్యాన్స్ ని సర్ప్రైజ్ చేసేలా ఉంటాయని ప్రస్తుతం టాక్.
ఈ మూవీలో చిరంజీవి టాక్సీ డ్రైవర్ గా నటిస్తున్నారు. ఇంతకుముందు బలుచిత్రాలలో చిరంజీవి ట్యాక్సీ డ్రైవర్ గా నటించి ఉన్నారు.. అవన్నీ బ్లాక్ బస్టర్ చిత్రాలు అని చెప్పవచ్చు. మరోపక్క ఈ మూవీలో కీర్తి సురేష్ చిరంజీవి చెల్లెలు క్యారెక్టర్ లో కనిపిస్తుంది. ఈ మూవీలో సిస్టర్ సెంటిమెంట్ హైలెట్ అని తెలుస్తోంది.
అలాగే సుశాంత్ కూడా ఈ మూవీలో కీలకమైన పాత్ర పోషిస్తున్నారు. ఏకే ఎంటర్టైన్మెంట్ బ్యానర్స్ పై అనిల్ సుంకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. అయితే ఇందులో స్పెషల్ సాంగ్ లో చాలా సంవత్సరాల తర్వాత శ్రియా శరన్ తెరమీద తన అందంతో కుర్రకారు మతి పోగొట్టడానికి రెడీ గా ఉన్నారు.
Web Title: Tamannaah layer character in bhola shankar, Tamannaah role revealed in Chiranjeevi Bhola Shankar, Keerthy Suresh, Chiranjeevi, Bhola Shankar Shooting update and location..