తనపై రూమర్లు ప్రచారం చేస్తున్న వారిపై అలా సెటైర్ వేసిన తమన్నా..!

505
Tamannaah responds on about her rumors

మిల్కీ బ్యూటీ తమన్నా భాటియా.. వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతోంది. ఈ మధ్యనే వెబ్ సిరీస్ లో కూడా నటిస్తోందనే ప్రచారం జరుగుతోంది. ఎప్పుడు చూసినా ఏదో ఒక ప్రాజెక్ట్ తో బిజీగా ఉండే తమన్నాకు సినిమాలే లేవని ఎవరో వదంతులు సృష్టించడం మొదలు పెట్టారట. ఇది తమన్నా దాకా చేరింది. ఆమె తనపై రూమర్లు వచ్చేలా చేసిన వాళ్లకు చాలా చక్కగా సమాధానం ఇచ్చింది.

నేను 365 రోజులు నేను బిజీగానే వున్నానని.. వరుసగా ప్రాజెక్టులు వస్తూనే వున్నాయని ఆమె చెబుతోంది. నాకు నచ్చిన పాత్రలను నేను ఎంచుకుంటూనే వున్నాను. ప్రస్తుతం నేను చేస్తున్న ‘సీటీమార్’ షూటింగు దశలో వుంది. ఈ సినిమాలోని పాత్ర కోసం నేను కబడ్డీ నేర్చుకున్నాను. నా ప్లానింగ్ ప్రకారం నేను ముందుకు వెళుతున్నాను. నేను ఖాళీగా వున్నానని ప్రచారం చేసేవారే ఖాళీగా వున్నారని నాకు అర్థమవుతోందని వాళ్లపై సరైన సెటైర్ వేసింది తమన్నా.

తమన్నా తెలుగులో వరుసగా సినిమాలు చేస్తోంది. ఎఫ్ 2 లోనూ, సైరా నరసింహా రెడ్డి సినిమాల్లో తమన్నా నటించింది. సరిలేరు నీకెవ్వరూ సినిమాలో మహేష్ బాబుతో కలిసి చిందేసింది. సీటీమార్ సినిమాతో పాటూ హిందీలో బోలె చూడియా సినిమాలో కూడా నటిస్తోంది. హిందీ క్వీన్ సినిమా రీమేక్ అయిన ‘దటీజ్ మహా లక్ష్మి’ సినిమా ఎప్పుడు విడుదల అవుతుందో తెలియడం లేదు. ‘ది నవంబర్స్ స్టోరీ’ అనే వెబ్ సిరీస్ లో కూడా తమన్నా నటిస్తోంది.