NBK108 special song details: దర్శకుడు అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ (Balakrishna) ఫ్యామిలీ ఎంటర్టైనర్ గా NBK108 సినిమా షూటింగ్ జరుపుకుంటున్న విషయం తెలిసిందే. దర్శకుడు అనిల్ మొదటిసారి బాలకృష్ణతో పనిచేయడం వల్ల ఈ సినిమాపై భారీగానే అంచనాలు ఉన్నాయి. వరుస బ్లాక్ బస్టర్ హిట్స్ తో ఫార్మ్ లో ఉన్న దర్శకుడు ఈ సినిమాతో హ్యాట్రిక్ కొట్టాలని చూస్తున్నాడు.
NBK108 special song details: బాలకృష్ణ (Balakrishna) ప్రతి ఒక్క సినిమాలో ఒక స్పెషల్ సాంగ్ అనేది ఉంటుంది. దానికి గాను బాలీవుడ్ నుంచి కానీ లేదంటే టాలీవుడ్ నుంచి కానీ హీరోయిన్స్ ని సెలెక్ట్ చేస్తూ ఉంటారు. ఇప్పుడు NB108 లో కూడా స్పెషల్ సాంగ్ సంబంధించిన హీరోయిన్ గురించి సోషల్ మీడియాలో న్యూస్ వైరల్ గా మారింది. హీరోయిన్ కి రెమ్యూనరేషన్ (Remuneration) విషయంలో కూడా భారీగాన్ని చెల్లిస్తున్నట్టు తెలుస్తుంది.
ఇప్పటికే బాలకృష్ణ (Balakrishna) సరసన కాజల్ అగర్వాల్ హీరోయిన్గా చేస్తున్న ఈ సినిమాలో శ్రీలీల కీలకమైన పాత్రలో చేస్తుంది. NBK108 స్పెషల్ ఐటెం సాంగ్ గురించి హీరోయిన్ తమన్నా (Tamannaah) ని సంప్రదించగా.. తాను కూడా దర్శకుడు కి ఓకే చెప్పినట్టు తెలుస్తుంది. అయితే ఈ సినిమా కోసం తమన్నా భారీగానే రెమ్యూనరేషన్ (Remuneration) అడిగినట్టు న్యూస్ వైరల్ అవుతుంది. భారీ స్థాయిలో రెమ్యూనరేషన్ డిమాండ్ చేయడంతో బాలకృష్ణ NBK108 మేకర్స్ ఆలోచనలో ఉన్నారని సమాచారం.

Balakrishna NBK108 Story:
NB108 story విషయానికి వస్తే.. బాలకృష్ణ ఈ సినిమాలో డబుల్ రోల్ చేస్తున్న విషయం తెలిసిందే.. కుర్రవాడిగా ఉన్నప్పుడు కృష్ణ చేసిన తప్పు వల్ల 14 ఏళ్ళు జైలు శిక్ష అనుభవిస్తారంట.. ఆ తరువాత 60 ఏళ్ల వ్యక్తిగా బాలయ్య గెటప్ క్యారెక్టర్ వెరీ పవర్ ఫుల్ గా ఉంటుందని సమాచారం తెలుస్తుంది. 60 ఏళ్ల వయసులో జైలు నుండి వచ్చిన బాలకృష్ణ జీవితంలో సంఘటనల ఆధారంగా మిగతా కథ ఉంటుందని సమాచారం.. దర్శకుడు అనిల్ కూడా పవర్ఫుల్ క్యారెక్టర్స్ డిజైన్ చేయడంలో తన వంతు పాత్ర పోషిస్తూ ఉంటారు ప్రతి సినిమాలో అలాగే ఈ సినిమాలో కూడా బాలకృష్ణ క్యారెక్టర్ ని వెరీ పవర్ ఫుల్ గా డిజైన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. మరి ఇంకొన్ని రోజులు పోతే గాని మరింత సమాచారం తెలియదు.
Web Title: Tamannaah item song in NBK108, Tamannaah’s Remuneration For A Special Song In Balakrishna Details, Special Song, Anil Ravipudi, Sreeleela, Kajal Agarwal, Balakrishna, Thamannah, Taman, NBK New Song Update, NBK108 story