తమన్నాతో రొమాన్స్ కేజీఎఫ్ స్టార్ యష్

0
61
Tamannah To Romance KGF Star Yash once again

Tamannah – Yash: సూపర్ హిట్ యాక్షన్ డ్రామా కేజీఎఫ్‌తో కన్నడ హీరో యష్‌కు పాన్-ఇండియా స్టార్‌డమ్ వచ్చింది. ఈ సినిమా మొదటి భాగం దేశవ్యాప్తంగా బ్లాక్ బస్టర్. రెండవ భాగం విడుదలకు సిద్ధమవుతోంది. ఈ చిత్రం తర్వాత కన్నడ డైరెక్టర్‌ నార్తన్‌ తెరకెక్కించనున్న చిత్రంలో యశ్‌ ఓ సినిమా చేయనున్నారట. ఈ చిత్రంలో పవర్‌ఫుల్‌ అండ్‌ యాంగ్రీ ఆర్మీ ఆఫీసర్‌ పాత్రలో కనిపిస్తారట యశ్‌.

ఆర్మీ ఆధారిత యాక్షన్ థ్రిల్లర్ కోసం నార్తాన్ గత రెండేళ్లుగా యష్‌తో చర్చలు జరుపుతున్నట్లు ఆ వర్గాలు తెలిపాయి. ఈ సినిమాలో యష్ శక్తివంతమైన ఆర్మీ ఆఫీసర్ పాత్రలో నటించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో మహిళా ప్రధాన పాత్ర పోషించడానికి నార్తాన్ కూడా తమన్నాతో చర్చలు జరుపుతున్నట్లు వినిపిస్తోంది. ఇటు దక్షిణాది అటు ఉత్తరాది భాషల్లో మంచి గుర్తింపు ఉన్న తమన్నా అయితే కథానాయికగా బాగుంటుందని భావించారట.

కెజిఎఫ్ చాప్టర్: 1 లోని ఐటమ్ సాంగ్‌లో తమన్నా యష్‌తో నటిచింది. ఈ సినిమా గురించి మరిన్ని వివరాలు త్వరలో ప్రకటించబడతాయి. ప్రస్తుతం, తమన్నా తన రాబోయే తెలుగు చిత్రాల ఎఫ్ 3, గుర్తుందా శీతాకాలం చిత్రాలతో బిజీగా ఉంది.