రాజమౌళిపై కంప్లైంట్ చేసిన కార్తీ..!

295
Tamil Actor Karthi upcoming movie Donga Telugu official Trailer Review
Tamil Actor Karthi upcoming movie Donga Telugu official Trailer Review

విభిన్న సినిమాల్లో యాక్ట్ చేయాలంటే తమిళనటుడు కార్తీ తర్వాతే..! ఒక్కో సినిమాకూ కొత్తదనం చూపిస్తూ.. కార్తీ దూసుకుపోతున్నాడు. ఇటీవల రిలీజ్ అయిన కార్తీ సినిమా ‘ఖైదీ’ ఎంత పెద్ద హిట్ గా నిలిచిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. పాటలు.. హీరోయిన్ లేకుండా తీసిన సినిమా 100 కోట్లకు పైగా కలెక్షన్లను రాబట్టి భారీ హిట్ గా నిలిచింది. అందుకే మరోసారి కంటెంట్ ఉన్న సబ్జెక్టు ను నమ్ముకున్నాడు కార్తీ. ‘దొంగ’ అనే సినిమా ద్వారా ప్రేక్షకులను అలరించడానికి వస్తున్నాడు. ఈ సినిమాలో జ్యోతిక మరో కీలక పాత్రలో కనిపిస్తోంది. జ్యోతిక కార్తీ అక్కగా కనిపిస్తోంది. ఈ సినిమాకు సంబంధించిన ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు.

కొన్ని సంవత్సరాల కిందట ఓ కుటుంబం నుండి ఓ కుర్రాడు తప్పిపోతాడు. ఆ తర్వాత తిరిగి కుటుంబం లోకి చేరుతాడు. అక్కడ జరిగిన సంఘటనలేంటి.. నిజంగానే ఆ కుర్రాడు ఈ కుటుంబానికి చెందిన వ్యక్తా..? అన్న ప్రశ్నలు ఉత్పన్నమయ్యేలా సినిమా ట్రైలర్ ను రూపొందించారు. కార్తీ నిజంగా తన తమ్ముడేనా అని డౌట్ పడే అక్క క్యారెక్టర్ లో జ్యోతిక నటించింది.

సొంత వదినతో కార్తీ నటిస్తున్న సినిమా ఇది. ఈ థ్రిల్లర్ సినిమా ట్రైలర్ లో ఎన్నో ఆసక్తికర అంశాలను జోడించారు. ఇక తెలుగు ప్రేక్షకులను ఆకట్టుకునే విధంగా అందులో కార్తీ చెప్పిన డైలాగ్ బాగా పేలింది. ఎలా ఉంది రా పెర్ఫార్మెన్స్.. న్యాయంగా రాజమౌళి సినిమాలో నన్ను పెట్టాలి.. ఎవరెవరినో పెడుతున్నారు అంటూ కార్తీ డైలాగ్స్ చెప్పాడు. ‘దృశ్యం’ సినిమాను తెరకెక్కించిన జీతూ జోసెఫ్ ఈ సినిమాకు దర్శకత్వం వహించడంతో మంచి థ్రిల్లింగ్ సబ్జెక్టు అని అందరూ భావిస్తున్నారు. తప్పకుండా కార్తీ కెరీర్ లో మరో హిట్ రాబోతోందని అభిమానులు ఆశిస్తున్నారు. డిసెంబర్ నెలలో సినిమా విడుదల కాబోతోంది.