నాగార్జున సరసన తమిళ బ్యూటీ అంకిత

0
275
tamil-actress-in-nagarjuna-upcoming-movie
tamil-actress-in-nagarjuna-upcoming-movie

తెలుగు గ్రీకువీరుడు నాగార్జున మంచి జోరుమీదున్నారు. లాక్‌డౌన్ తరువాత వరుస సినిమాలు చేస్తూ దూకుడు కనబరుస్తున్నారు. నాగార్జున ఇటీవల పూర్తి చేసుకున్న వైల్డ్‌డాగ్ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. అయితే తాజాగా నాగ్ తన తదుపరి చిత్రాన్ని ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో తెరకెక్కించనున్నారు. అయితే ఇప్పటి వరకు ఈ సినిమాలోని నటీనటుల గురించి ఎటువంటి సమాచారం రాలేదు.

 

 

తాజాగా వస్తున్న వార్తల ప్రకారం ఈ సినిమాలో నాగ్ సరసన నటించేందుకు తమిళ బ్యూటీని ఎంపిక చేశారంట. ఈ మేరకు వార్తలు సినీ సర్కిల్స్‌తో తెగ హల్‌చల్ అవుతున్నాయి. ఈ కాంబోలో రానున్న సినిమాలో తమిళ స్టార్ హీరోయిన్ అంకిత సురేందర్ కూడా కీలక పాత్రలో నటించనున్నట్లు టాక్ నడుస్తోంది. ఈ సినిమా వచ్చే వారం నుంచి ప్రారంభం కానుంది. రెగ్యులర్ షూటింగ్ ఈ నెలాఖరుకి మొదలవుతుంది. ఈ సినిమా చిత్రీకరణ హైదరాబాద్, ఊటి, లండన్‌లలో జరగనుందంట. ఈ సినిమాను కేవలం మూడు నెలల్లో పూర్తి చేయాలని చిత్రయూనిట్ ఆలోచిస్తుంది.

Previous articleపవన్ సినిమాలో స్పెషల్ సాంగ్ చేయనున్న తమన్నా
Next article‘ఆదిపురుష్‌’ లో ప్రభాస్ తల్లిగా హేమమాలిని