చిరంజీవి ఖైదీ.. ఇప్పుడు తమ్ముడు పవన్ కళ్యాణ్

0
659
Tamil Hero Karthi Eyes On Power Star Pawan Kalyan Cinema Title Thammudu Movie.
Tamil Hero Karthi Eyes On Power Star Pawan Kalyan Cinema Title Thammudu Movie.

మెగాస్టార్ చిరంజీవి కెరీర్ ను మలుపుతిప్పిన ‘ఖైది’ టైటిల్ ను కార్తి తన కొత్త సినిమాకు వాడుకున్న సంగతి తెలిసిందే. మెగాస్టార్ ఫామిలీ టైటిల్స్ ఇలా ఇతర హీరోలు వాడుకోవడంపై మెగా ఫ్యాన్స్ లో కొంత అసంతృప్తి ఉంది కానీ వాళ్ళు కూడా వచ్చే సినిమాలని ఎంజాయ్ చేస్తున్నారు . కార్తి.. తమిళ్ తో పాటు తెలుగులో కూడా మంచి క్రేజ్ ఉన్న హీరో. సూర్య తమ్ముడు గా మనకి పరిచయం అయినప్పటికీ విభిన్న కథలు ఎంచుకుంటూ తన నేచురల్ యాక్టింగ్ తో రంజింపజేసే హీరో అనడంలో ఎటువంటి సందేహం లేదు. కార్తీ (karthi) హీరోగా దీపావళి కానుకగా ప్రేక్షకుల ముందుకొచ్చిన ‘ఖైదీ’ ఖతర్నాక్ జోష్‌లో ఉంది.

“ఖైదీ”తో వంద కోట్లు గ్రాస్ కలెక్ట్ చేసి ఫుల్ జోష్ లో ఉన్న కార్తీ త్వరలోనే మరో సినిమాను విడుదల చేసేందుకు సన్నాహాలు చేసుకొంటున్నాడు. సినిమా కోసం అప్పుడే తెలుగు వెర్షన్ టైటిల్ మాత్రం ఫిక్స్ చేసుకున్నాడు కార్తీ. తన మునుపటి చిత్రానికి చిరంజీవి కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన “ఖైదీ” అనే టైటిల్ ను పెట్టుకొన్న కార్తీ ఇప్పుడు తన తదుపరి చిత్రం కోసం పవన్ కళ్యాణ్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ అయిన “తమ్ముడు” టైటిల్ పై కన్నేశాడు. కార్తి ప్రస్తుతం ‘దృశ్యం’ ఫేమ్ జీతూ జోసెఫ్ దర్శకత్వంలో ఒక సినిమాలో నటిస్తున్నాడు. ఈ సినిమాలో కార్తి వదినమ్మ జ్యోతిక మరో కీలక పాత్ర పోషిస్తోంది. ఈ సినిమాలో అక్కగా జ్యోతిక.. తమ్ముడిగా కార్తి నటిస్తారట. కథకు తగ్గట్టు ఈ సినిమాకు తమిళంలో ‘తంబి’ అనే టైటిల్ నిర్ణయించారు. తంబి అంటే తెలుగులో తమ్ముడు..పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో సూపర్ హిట్ గా నిలిచిన చిత్రం ‘తమ్ముడు’. ఇంకా సినిమా టీం నుండి టైటిల్ ని అనౌన్స్ చేయటమే లేట్..

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here