ఎన్టీఆర్ అలాగే రామ్ చరణ్ కలిసి నటించిన సినిమా RRR. రాజమౌళి దర్శకత్వం వహించిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద సక్సెస్ ఫుల్ గా రన్ అవటమే కాకుండా నేషనల్ లెవెల్ లో గుర్తింపు తెచ్చుకుంది. అంతేకాకుండా ఆస్కార్ (Oscar 2023) అవార్డ్ నామినేషన్ లో నాటు నాటు సాంగ్ ఉన్న విషయం తెలిసిందే.
ఆర్ఆర్ఆర్ (RRR movie) సినిమా కి ఆస్కార్ దక్కుతుందా లేదా అనేది సెకండరీ విషయమైతే ఈ సినిమా ప్రమోషన్స్ కోసం మూవీ టీం అలాగే రాజమౌళి ఈ సినిమాకి ఎలాగైనా ఆస్కార్ తీసుకురావాలని డబ్బుని విపరీతంగా ఖర్చు పెడుతున్నారని తెలుస్తుంది. ఈ సినిమా ప్రొడ్యూసర్ అయిన దానయ్య సుమారు 500 కోట్ల బడ్జెట్ తో ఆర్ఆర్ఆర్ (RRR budget) నిర్మించడం జరిగింది.
అయితే ఏ అవార్డు ఫంక్షన్ లోనూ దానయ్య ఇంతవరకు కనిపించలేదు. అలాగే సోషల్ మీడియాలో కూడా ఈ సినిమా గురించి ఎక్కడ దానయ్య మాట్లాడకపోవడం చాలామంది అనేక అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇక ఈ సినిమాని ఇంటర్నేషనల్ లెవెల్ లో ప్రమోట్ చేయడానికి ప్రొడ్యూసర్ దానయ్య ఒప్పుకోలేదని ఫిలింనగర్లో టాక్ అయితే వినపడుతుంది.
ఇక ఈ సినిమాని ఆస్కార్ (Oscar 2023) నామినేషన్ లో ఉంచటం కోసం అని దర్శకుడు రాజమౌళి దాదాపు 80 కోట్ల ప్రమోషన్ కోసం ఖర్చు పెట్టినట్టు తెలుస్తుంది. ఇక విదేశాల్లో కాంట్రాక్ట్స్ అలాగే ప్రమోషన్స్ గురించి ఆర్కా మీడియా నిర్మాత అయిన శోభు యార్లగడ్డ సహాయం తీసుకున్నారు అంట.
అయితే RRR సినిమా ఆస్కార్ ప్రమోషన్స్ కోసం 80 కోట్లు ఖర్చు పెట్టడం గురించి టాలీవుడ్ ప్రొడ్యూసర్ తమ్మారెడ్డి భరద్వాజ్ సంచలన వ్యాఖ్యలు చేయడం కూడా జరిగింది. రీసెంట్గా రవీంద్రభారతిలో జరిగిన ఓ కార్యక్రమంలో తమ్మారెడ్డి మాట్లాడుతూ.. సినిమా మేకింగ్ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా ఉందనే ప్రశ్నకు సమాధానం ఇస్తూ RRR మూవీ ప్రస్థానం తీసుకురావడం జరిగింది.
ఆస్కార్ ప్రమోషన్స్ కోసం RRR Team 80 కోట్లు ఖర్చు చేశారు. ఆ 80 కోట్లు మాకు ఇస్తే ఓ 10 సినిమాలు తీసి వాళ్ళ మొఖాన కొడతాం.. అని విమర్శించడం జరిగింది. అయితే ఈ విమర్శలపై చాలామంది చాలా రకాలుగా కామెంట్స్ చేస్తున్నారు. ఇందులో అందరి వాదన నిజమే అయినా పెట్టుకునే వారికి లేని బాధ చూసేవారికి ఎందుకు అనేది మాత్రం నిజం.