Devara NTR Speech at SIIMA 2023: ప్రతిభ మరియు బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన జూనియర్ ఎన్టీఆర్, వెండితెరపై అనేక రకాల పాత్రలను అప్రయత్నంగా నటించగలిగిన తన సామర్థ్యాన్ని స్థిరంగా నిరూపించుకున్నాడు. “RRR”లో అతని అసాధారణమైన నటన ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల హృదయాలను దోచుకుంటూ విశేషమైన నటుడిగా అతని స్థానాన్ని మరింత పటిష్టం చేసుకున్నాడు.
Devara NTR Speech at SIIMA 2023: RRR సినిమాతో ఆస్కార్ అవార్డును అందించనప్పటికీ, అతను SIIMA 2023 ఉత్తమ నటుడు అవార్డును గెలుచుకున్నాడు. ఇది NTR అత్యుత్తమ ప్రతిభకు మరియు అంకితభావానికి నిదర్శనం. దుబాయ్ లో నిన్న జరిగిన ఈ సాయిమా అవార్డ్స్ ఫంక్షన్ గురించి చాలామంది ప్రముఖులు అలాగే నటినట్లు ఆసక్తిగా చూశారు. ఊహించిన విధంగా అందరూ ఈ అవార్డు ఎన్టీఆర్ కి రావటం జరిగింది.
అయితే అవార్డు అందుకున్న సందర్భంగా వేదికపై ఎన్టీఆర్ తీవ్ర భావోద్వేగంతో మాట్లాడారు. ఆయన మాటలు అభిమానుల హృదయాలను కదిలించాయి. రాజమౌళితో పాటు అభిమానులకు ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలిపారు. ఎన్టీఆర్ మాట్లాడుతూ “నా సహనటుడికి, మా అన్నకు, నా స్నేహితుడు రామ్ చరణ్‌కి ధన్యవాదాలు .. రామ్ చరణ్ కూడా సినిమాలో కీలకమైన పాత్ర చేయడంతో ఈ సినిమాకి ఇంత వైభవం వచ్చిందంటూ. “కొమరం భీమ్ పాత్ర కోసం నన్ను పదే పదే నమ్మినందుకు నా జక్కన్నకు కృతజ్ఞతలు.

అభిమానులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. నా ఒడిదుడుకుల్లో అలాగే నేను బాధపడిన ప్రతిరోజు నాకోసం నిలబడినందుకు అలాగే నా బాధను పంచుకున్న నా అభిమాన అభిమానులందరికీ ధన్యవాదాలు.” అని తెలియజేయడం జరిగింది. . ఇక సినిమాల విషయానికి వస్తే ప్రస్తుతం ఎన్టీఆర్ కొరటాల శివ దర్శకత్వంలో దేవరా సినిమా చేస్తున్న విషయం తెలిసిందే. ఈ సినిమాని అత్యంత ప్రతిష్టాత్మకంగా భారీ బడ్జెట్ తో నిర్మిస్తున్నారు, అంతేకా అంతేకాకుండా ఈ సినిమాని ఏప్రిల్ 2024 నెలలో విడుదలకు సిద్ధం చేస్తున్నారు మేకర్స్. దీని తర్వాత రుతిక్ రోషన్ తో war 2 సినిమాని చేయబోతున్నారు.