taraka Ratna Health Condition: నారా లోకేష్ పాదయాత్రలో తారకరత్న కి హార్ట్ ఎటాక్ రావడం అలాగే అతని మెరుగైన వైద్యం కోసం అని చెన్నైకి బదిలీ చేయడం..అక్కడ ట్రీట్మెంట్ జరుగుతున్న విషయం తెలిసిందే. తారకరత్న ఆరోగ్యంపై హిందూపూర్ టీడీపీ నేత అంబికా లక్ష్మీనారాయణ తాజా సమాచారం అందించారు.
taraka Ratna Health Condition: ఆయన అందించిన సమాచారం మేరకు తారకరత్న న్ని మెరుగైన వైద్యం కోసం విదేశాలకు తరలించే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తుంది. ప్రస్తుతం తారకరత్న ఆరోగ్యం నిలకడగా ఉందని, మెరుగ్గా ఉందని చెప్పారు. మరోవైపు ఆయన మేనమామ, నటుడు-రాజకీయవేత్త బాలకృష్ణ తారకరత్నపై చాలా శ్రద్ధ తీసుకుంటున్నారని తెలియజేశారు.
ఆయన మీడియాతో మాట్లాడుతూ, ఫిబ్రవరి 3 న అతని పురోగతిని అంచనా వేయడానికి మరియు మెదడు పనితీరును పరిశీలించడానికి వైద్యులు బ్రెయిన్ స్కాన్ చేశారని ఇది రాబోయే రోజుల్లో ఆరోగ్య పరిస్థితి మెరుగుపరిచేలా వైద్యం అందించడానికి ఉపయోగపడుతుందని డాక్టర్లు తెలియజేయడం జరిగిందంట.
అయితే ఇప్పుడు కుటుంబ సభ్యులు మొత్తం ఈ బ్రెయిన్ స్కాన్ సంబంధించిన కీలకమైన EEF రిపోర్టులు గురించి ఎదురు చూస్తున్నట్టు చెప్పారు. ఆ తర్వాత ఆయనను విదేశాలకు తరలించే అవకాశం ఉందని అంబిక పేర్కొన్నారు.