తారకరత్న భార్య అలేఖ్య రెడ్డి పోస్ట్ వైరల్: తారకరత్న చనిపోయి నెల రోజులు కావడంతో తన భార్య అలేఖ్య రెడ్డి సోషల్ మీడియా ద్వారా తన జ్ఞాపకాలని పంచుకుంది. అలాగే తన జ్ఞాపకాలని ఎంత పద లింగా ఉంచుకుందో ఈ పోస్ట్ ద్వారా అందరికీ తెలియజేసింది. దీనితోపాటు తను ఎంత బాధను ఎంత అనుభవిస్తుందో గుర్తుచేసుకొని ఎమోషనల్ అయ్యారు.
ఫిబ్రవరి 18న తారకరత్న మరణించడం జరిగింది. అలేఖ్య రెడ్డి తన సోషల్ మీడియా ద్వారా ఫోటోలను షేర్ చేస్తూ వాళ్ల మధ్య ఉన్న అనుబంధం అలాగే బాధని వ్యక్తం చేశారు. ఆమె సోషల్ మీడియాలో ఇలా రాయటం జరిగింది.
“నువ్వు మా నుండి దూరం అయ్యి నేటితో సరిగ్గా నెల రోజులు అవుతుంది. కానీ నీ జ్ఞాపకాలు మాత్రం నన్ను ఇప్పటికీ, ఎప్పటికీ దహించి వేస్తూనే ఉంటాయి. ఇక మన ప్రేమ ప్రయాణంలో నేను భయంగా ఉన్నాగానీ నువ్వు మాత్రం.. మనం కచ్చితంగా కలిసి జీవించబోతున్నాం అంటూ ఎంతో ధైర్యం ఇచ్చావ్. నీ పోరాటం ఫలితంగా మన పెళ్లి జరిగింది.
అయితే మన పెళ్లి తర్వాత మనపై ఎంతో మంది వివక్ష చూపించారు. అయినా కానీ నువ్వు నా దగ్గర ఉండటం నాకు ఎంతో సంతోషాన్ని ఇచ్చింది. నిషిక పుట్టాక మన లైఫ్ మారిపోయింది. మన సంతోషం రెట్టింపు అయ్యింది. కానీ మన కష్టాలు అలాగే ఉన్నాయి. మనల్ని అయినవాళ్లే ద్వేషించారు. నీ గుండెలోని బాధను వారు ఏనాడు అర్థం చేసుకోలేదు” అంటూ ఎమోషనల్ పోస్ట్ ను తన ఇన్ స్టాగ్రామ్ లో షేర్ చేసింది.
అలాగే ఇంకొన్ని విషయాలు పంచుకుంటూ.. 2019లో మాకు ఆనందం కలిగింది..కవలలు జన్మించారు. నాకు ఇంకా గుర్తుంది మీరు ఎప్పుడూ పెద్ద కుటుంబాన్ని కోరుకున్నారు. మీ కుటుంబాన్ని కోల్పోయారని అందుకే మాకు అందమైన కుటుంబాన్ని అందించారు. ఇన్నేళ్లూ ఆ పోరాటం చివరి వరకు సాగింది. అయితే ఎవరికీ అర్థం కాలేదు. మీరు మీ హృదయంలో మోసుకెళ్ళే బాధను చూడలేదు.
ఎందుకంటే కొన్నిసార్లు మేము మా బాధతో బాధపడినప్పుడు అది తీర్చింది మీరే.. మీరు ఎదుర్కొన్న కష్టాల నుండి నేను మీకు సహాయం చేయలేకపోయాను.. మొదటి నుండి మాకు అండగా నిలిచిన వ్యక్తులు మాత్రమే చివరి వరకు ఉన్నారు కానీ మేము కోల్పోయిన వారు చాలా కాలం పోయారు. మీ సమాధిపై కూడా మిమ్మల్ని కనుగొనలేకపోయారు. .నువ్వే మా నిజమైన హీరో ఓబు అంటూ ఇన్ స్టాగ్రామ్ లో అలేఖ్యరెడ్డి చేసిన పోస్ట్ ఇప్పుడు వైరల్ గా మారింది.
View this post on Instagram
Taraka Ratna wife alekhya reddy instagram post viral.. alekhya reddy emotional post viral on social media, Taraka Ratna wife alekhya reddy explain her emotion on instagram with photos