HomeBigg Boss 7 TeluguBigg Boss Telugu 7: ఈవారం డేంజర్ లో ఎవరు..? బిగ్ బాస్ వీకెండ్ ట్విస్ట్...

Bigg Boss Telugu 7: ఈవారం డేంజర్ లో ఎవరు..? బిగ్ బాస్ వీకెండ్ ట్విస్ట్ ఇదేనా ? 

this week bigg boss voting result, Bigg boss telugu 7 this week eliminated Contestant details, Bigg Boss 7 telugu this week wild card entry, BB7 telugu latest promo review

this week bigg boss voting result, Bigg boss telugu 7 this week eliminated Contestant details, Bigg Boss 7 telugu this week wild card entry, BB7 telugu latest promo review

బిగ్ బాస్ 7 మొదలయ్యి ఐదో వారం చేరుకుంది.. ఈవారం ఎలిమినేషన్ లో హౌస్ నుండి ఏడుగురు ఉన్నారు. పవర్ హస్త్ర కోల్పోవడంతో శివాజీ కూడా ఈ వారం ఎలిమినేషన్ లోకి రావడం జరిగింది. . దీంతో ప్రశాంత్, సందీప్, శోభాశెట్టి తప్ప హౌస్ లో ఉన్న వారంతా ఈ వారం ఎలిమినేషన్ లో ఉన్నారు. . అయితే నాలుగు వారాల్లో లేడీ హౌస్ మేట్స్ మాత్రమే ఎలిమినేట్ కాగా ఈ వారం ఎవరు ఎలిమినేట్ అవుతారు అంటూ అందరూ ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. 

బిగ్ బాస్ ఈ వారం చాలా ట్విస్ట్ లతో నామినేషన్ ప్రక్రియ అలాగే ఎలిమినేషన్ కూడా చేయబోతున్నట్టు తెలుస్తుంది.. దీనితోపాటు ఈ వారం వైల్డ్ కార్డు ఎంట్రీ కూడా ఉండబోతుందని సమాచారం అయితే అందుతుంది.  ఇప్పటికే హౌస్ మేట్స్ దగ్గర ఉన్న తమ పవర్ అస్త్రాలని బిగ్ బాస్ తిరిగి ఇచ్చేయమని చెప్పాడు. 

దీంతో శివాజీతో పాటుగా పవర్ అస్త్రారాన్ని సందీప్, శోభా, పల్లవి ప్రశాంత్ లు కూడా కోల్పోయి సాధరణ హౌస్ మేట్స్ గా మిగిలారు. ఇక ఈవారం ఓటింగ్ రిజల్ట్ గురించి చూస్తే అత్యధికంగా శివాజీ ఓటింగ్ సాధించి మొదటి స్థానంలో ఉండగా చివరి రెండు స్థానాల్లో శుభ శ్రీ అలాగే టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.  ఓటింగ్ ప్రకారమైతే ఈ వారం టేస్టీ తేజ హౌస్ నుండి ఎలిమినేట్ అవ్వటం పక్క అంటున్నారు.. కానీ ఈ వీకెండ్ బిగ్ బాస్ మరో ట్విస్ట్ ఉండబోతుందని తెలుస్తుంది. 

 లెక్క ప్రకారం అయితే ఈ వారం టేస్టీ తేజ హౌస్ నుండి ఎలిమినేట్ కావాల్సి వస్తుంది… కానీ ఇక్కడ బిగ్ బాస్ హౌస్ లో పవర్ హస్త్ర సాధించని ఏడుగురిని ఎలిమినేట్ చేసి కొత్తగా వైల్డ్ కార్డు ఎంట్రీ ద్వారా ఇంకో ఆరుగురు హౌస్ మేట్స్ ని రంగంలోకి దించుతున్నట్టు తెలుస్తుంది.  కానీ ఈ వారం బిగ్ బాస్ ఓటింగ్ ప్రకారం అలాగే ప్రముఖ మీడియా సంస్థలు నిర్వహిస్తున్న ఓటింగ్ రిజల్ట్ ప్రకారమైతే టేస్టీ తేజ డేంజర్ జోన్ లో ఉన్నట్టు తెలుస్తుంది.  మరి బిగ్ బాస్ హౌస్ లో ఈవారం ఎలాంటి ట్విస్ట్ ఉంటుందో చూడాలి.