సినీ నటుడు శివప్రసాద్‌ మృతి చెందారా ?

107
Sivaprasad, tollywood, Latest Movie News
Sivaprasad, tollywood, Latest Movie News

సినీ నటుడు, చిత్తూరు మాజీ ఎంపీ, టీడీపీ నాయకుడు నారమల్లి శివప్రసాద్‌ అనారోగ్యం కారణంగా మృతి చెందినట్లు వార్తలు వస్తున్నాయి. గత నెలలుగా వెన్నునొప్పి, కిడ్నీ సంబంధిత వ్యాధితో ఆయన బాధపడుతున్నారు. ప్రత్యేక హోదా ఉద్యమంలో తనదైన ప్రత్యేక శైలితో శివ ప్రసాద్‌ ఆకట్టున్నారు. శివప్రసాద్ 2009లో టీడీపీ తరపున చిత్తూరు ఎంపీగా పోటీ చేసి గెలిచారు. తర్వాత 2014 ఎన్నికల్లోనూ ఘన విజయం సాధించారు. అయితే గత సార్వత్రిక ఎన్నికల్లో మాత్రం వైఎస్సార్‌సీపీ అభ్యర్థి రెడ్డప్ప చేతిలో ఓడిపోయారు. కాగా అరోగ్యం సహకరించకపోవడంతో కొద్దిరోజులుగా ఆయన పార్టీ కార్యక్రమాలకు కూడా దూరంగా ఉంటున్నారు.

ఇక శివప్రసాద్ రాజకీయ రంగం మాత్రమే కాదు.. సినిమాల్లోనూ రాణించారు. ఆయన ఎన్నో సినిమాల్లో మంచి పాత్రల్లో నటించారు. మొదట తిరుపతిలో డాక్టర్‌గా పని చేసిన ఈయన నటన మీద మక్కువతో సినీ రంగం వైపు అడుగులు వేశారు. ఖైదీ లాంటి హిట్‌ సినిమాలో జూనియర్‌ ఆర్టిస్ట్‌ గా నటించిన ఈయన.. క్రమంగా ఎదుగుతూ 2006 సంవత్సరంలో విడుదలైన డేంజర్ సినిమాలో విలన్‌ గా నటించి మెప్పించారు. ఈ సినిమాలో ఈయన నటనకు ప్రభుత్వం నంది అవార్డు ఇచ్చి సన్మానించింది.