సూపర్ స్టార్ మహేష్ బాబు, పరశురాం దర్శకత్వంలో ‘సర్కారు వారి పాట’ అనే చిత్రం చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా తొలి షెడ్యూల్ పూర్తిచేసుకోగా.. రెండో షెడ్యూల్ రీసెంట్గా ప్రారంభమైంది. ఈ షెడ్యూల్ ఫిబ్రవరి 21 నాటికి పూర్తి కానుందని సమాచారం.
ఇది పూర్తికాగానే ఫ్యాన్స్‌ను అలరించేందుకు చిన్న వీడియోను విడుదల చేయాలని ‘సర్కారు వారి పాట’ చిత్ర బృందం భావిస్తుందట. దుబాయ్ లోని అద్భుతమైన లొకేషన్స్‌తో పాటుగా మూవీ సెట్స్ చూపించబోతున్నారని తెలుస్తోంది. రీసెంట్ షెడ్యూల్ లో కథానాయిక కీర్తి సురేష్ హాజరైంది. ఈ మూవీని పరుశురామ్ సోషల్ మెసేజ్ కథతో తెరకెక్కించనున్నాడట. ముఖ్యంగా బ్యాకింగ్ రంగంలో అవినీతికి సంబంధించిన అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించబోతున్నారని టాక్ వినిపిస్తోంది.