Balakrishna #NBK105 First Look, Teaser, Latest Telugu news
Balakrishna #NBK105 First Look

నట సింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కె.ఎస్.రవికుమార్ దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. కాగా ఈ చిత్రం సెకెండ్ షెడ్యూల్ హైద‌రాబాద్ రామోజీ ఫిలింసిటీలో బాలయ్య పై కొన్ని పోరాట సన్నివేశాలు చిత్రీకరించారు. కాగా తాజాగా సినీ వర్గాల సమాచారం ప్రకారం చిత్ర యూనిట్ ఈ మూవీ టీజర్ విడుదలకు సన్నాహాలు చేస్తున్నారు. వచ్చే నెలలో దసరా కానుకగా అక్టోబర్ 8న ఈ సినిమా టీజర్ ను విడుదల చేయనున్నారు. ఈ టీజర్ కి సంబంధించిన డబ్బింగ్ నిన్న శబ్ధాలయ స్టూడియోస్‌ లో మొదలైంది. బాలకృష్ణ తన పాత్రకు డబ్బింగ్ చెప్పారు. ఈ సినిమాలో బాలయ్య రెండు గెటప్ ల్లో కనిపించనున్నారు. రెండో గెటప్ లో బాలయ్య ఇంకా యంగ్ లుక్ లో కనిపించనున్నారని.. ఈ లుక్స్ కోసం బాలయ్య రోజుకి ఐదు గంటలు వ్యాయామం చేస్తున్నారని తెలుస్తోంది.

ఇక ఈ చిత్రంలో రెండు భిన్నమైన పాత్రల్లో కనిపిస్తున్న బాలయ్య సరసన సోనాల్ చౌహాన్ అండ్ వేదిక హీరోయిన్లుగా నటించనున్నారు. అయితే వేదిక మధ్య వయస్సులో ఉండే బాలయ్య పాత్రకు జోడీగా కనిపించనుంది. అలాగే ఓ కీలకమైన పాత్రలో నమితను కనిపించనుంది. నమితది నెగటివ్ షేడ్స్ ఉన్న పాత్ర.. ముఖ్యంగా సినిమాలో బాలయ్యకి విలన్ గా కనిపించనుంది. ఇప్పటికే సింహా సినిమాలో బాలయ్య సరసన నమిత నటించింది. ఇక ఈ చిత్రంలో విల‌క్ష‌ణ న‌టుడు జ‌గ‌ప‌తిబాబు పవర్ ఫుల్ విల‌న్‌ గా న‌టించ‌బోతున్నాడు. బ్లాక్‌బ‌స్ట‌ర్ `లెజెండ్‌` త‌ర్వాత బాల‌కృష్ణ‌, జ‌గ‌ప‌తిబాబు కాంబినేష‌న్‌లో ఈ చిత్రం రూపొందుతుంది. ప్ర‌ముఖ సంగీత ద‌ర్శ‌కుడు చిరంత‌న్ భ‌ట్ సంగీత సార‌థ్యం వహిస్తున్నారు. ప్ర‌ముఖ నిర్మాత, సి.కె.ఎంట‌ర్‌ టైన్‌మెంట్స్ అధినేత సి.క‌ల్యాణ్ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్నారు. `జైసింహా` వంటి సూప‌ర్ డూప‌ర్ హిట్ త‌ర్వాత ఈ హిట్ కాంబినేష‌న్‌ లో రూపొంద‌నున్న చిత్ర‌మిది. అలాగే ఈ చిత్రానికి ‘రూలర్’ అనే టైటిల్ కూడా పరిశీలనలో ఉంది. ఈ సినిమాను డిసెంబర్ లో విడుదల చేయాలని మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు.