‘రాధేశ్యామ్‌’ మూవీ అప్డేట్‌ వచ్చేసింది

0
200
teaser-of-prabhas-radhe-shyam
teaser-of-prabhas-radhe-shyam

రెబల్ స్టార్ ప్రభాస్‌కి ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. బాహుబలి సినిమా తరువాత ప్రభాస్ రేంజ్‌ అమాంతం పెరిగిపోయింది. ఆ తరువాత వరుస భారీ బడ్జెట్ సినిమాలు చేస్తున్నారు. తాజాగా ప్రభాస్ పూర్తి చేసిన సినిమా రాధేశ్యామ్. ఈ సినిమా జిల్ ఫేమ్ రాధాకృష్ణ దర్శకత్వంలో రూపొందుతుండగా… పూజా హెగ్డే హీరోయిన్‌గా చేసింది.

 

 

ఇది ఇలా ఉండగా.. ఈ సినిమా టీజర్ కోసం ప్రభాస్ అభిమానులు ఎంతగానో వేచి చూస్తున్నారు. అయితే వారికి తీపి కబురు అందిందనే చెప్పాలి. ఇవాళ రాధేశ్యామ్‌ మూవీ నుంచి అప్డేట్‌ వచ్చేసింది. ఈ సినిమా ప్రీ-టీజర్‌ను చిత్ర యూనిట్‌ రిలీజ్‌ చేసింది. “మీకు తెలిసిన మనిషి ఇతడు.. ఈ సారి అతడి హృదయాన్ని తెలుసుకుందాం” అంటూ రెబల్‌స్టార్‌ నడిచివస్తోన్న వీడియోని రిలీజ్‌ చేసింది. ఇంకా పూర్తి స్థాయి ఫస్ట్‌ గింప్స్‌ను ఫిబ్రవరి 14న రిలీజ్‌ చేస్తామని ప్రకటించింది. దీంతో ప్రభాస్‌ ఫ్యాన్స్‌లో సందడి మొదలైంది.

Previous articleఅల్ల‌రి న‌రేష్ ‘నాంది’ సినిమా ట్రైలర్
Next articleపూరీ-రవితేజ కాంబినేషన్‌లో సినిమా