Teja Rana's next Rakshasa Rajyamlo Ravanasurudu movie titled locked
Teja Rana's next Rakshasa Rajyamlo Ravanasurudu movie titled locked

(Teja Rana’s next Rakshasa Rajyamlo Ravanasurudu movie titled locked)తెలుగు తెరపై ఇప్పటివరకూ వచ్చిన అతి క్రూరమైన, కర్కశమైన ప్రతినాయక పాత్రలలో ‘బాహుబలి’లోని బల్లాలదేవ పాత్ర ఒకటి. పురాణాల్లోకి వెళితే రావణుడు కూడా ఇంచు మించు ఇదే విధమైన పని చేశాడు. రాముడి భార్య సీత పై మనసు పడి ఆమెను అపహరించుకుని వెళ్లి బంధిస్తాడు. ఇప్పుడు వీరిద్దరి ప్రస్తావన ఎందుకంటే… ‘బాహుబలి’లో భల్లాలదేవగా ప్రతినాయకుడి పాత్రలో కనిపించిన రానా దగ్గుబాటి, ఈసారి రావణుడిగా సరికొత్త ప్రతినాయక పాత్రలో నటించడానికి సిద్ధమవుతున్నాడని సమాచారం.

తేజ దర్శకత్వంలో రానా దగ్గుపాటి నటించిన ‘నేనే రాజు నేనే మంత్రి’ సూపర్ హిట్ అయింది. ఈ సినిమా క్లైమాక్స్ అదిరిపోయింది. ఎవరూ ఊహించని క్లైమాక్స్ ప్రేక్షకులని థ్రిల్ చేసింది. మరోసారి తేజు-రానా కలవబోతున్నట్టు సమాచారమ్. రానా కోసం తేజ ఓ వైవిధ్యమైన కథని రెడీ చేసే పనిలో ఉన్నారంట. ఈ సినిమా కోసం ఆయన ‘రాక్షస రాజ్యంలో రావణాసురుడు’ అనే టైటిల్ ను పరిశీలిస్తున్నాడని చెబుతున్నారు.

‘రాక్షస రాజ్యంలో రావణుడు’ చిత్రంలో హీరోగా రానా పాత్ర కూడా ప్రతినాయక ఛాయలతో ఉంటుందట. నెగిటివ్ షేడ్ హీరో రోల్ అన్నమాట. సమకాలీన సామాజిక అంశాలతో డార్క్ ఎంటర్టైనర్గా ఈ సినిమాను రూపొందించడానికి సన్నాహాలు చేస్తున్నారట. ప్రస్తుతం వేణు ఊడుగుల దర్శకత్వంలో ‘విరాటపర్వం’ చేస్తున్నారు రానా..