జూనియర్ ‘ఇంద్ర’ ‘జాంబీ రెడ్డి’ ఫస్ట్ లుక్

0
268
Teja Sajja's First Look In Prashanth Varma's Zombie Reddy Is Out

టాలెంటెడ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ ‘అ!’ సినిమాతో జాతీయ స్థాయిలో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రస్తుతం ఈ యువ దర్శకుడు మూడో సినిమాగా ”జాంబీ రెడ్డి” అనే విభిన్న తరహా చిత్రాన్ని ప్రకటించారు. హీరో ఎవరనే విషయంలో సస్పెన్స్ మెయింటైన్ చేస్తూ వచ్చారు. నిన్న మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ‘జాంబీ రెడ్డి’ పోస్టర్ వదిలారు.

ఇప్పుడు లేటెస్టుగా తేజ సజ్జను హీరోగా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదల చేసారు. ‘ఇంద్ర’ చిత్రంలో చిన్నప్పటి చిరంజీవిగా న‌టించడంతో పాటు సుమారు 50 చిత్రాల్లో బాల న‌టుడిగా మెప్పి్ంచి ప్రేక్షకుల ప్రశంస‌లు అందుకున్న తేజ సజ్జా. స‌మంత ప్రధాన పాత్రలో న‌టించిన ‘ఓ బేబీ’ సినిమాలో ఓ కీల‌క పాత్రలో ఆక‌ట్టుకున్న తేజ స‌జ్జా.. ‘జాంబీ రెడ్డి’తో హీరోగా ప‌రిచ‌య‌మ‌వుతున్నాడు.

Teja Sajja's First Look In Prashanth Varma's Zombie Reddy Is Out

అయితే తెలుగులో ఇలాంటి జాంబీల కాన్సెప్ట్ వర్కౌట్ అవుతుందా అని ఇండస్ట్రీ వర్గాల్లో కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఫ‌స్ట్ లుక్ పోస్టర్‌లో తేజ గ‌ద ప‌ట్టుకొని ఉండ‌గా, జాంబీలు అత‌నిపై ఎటాక్ చేయ‌బోతున్నట్లు క‌నిపిస్తోంది. మోష‌న్ పోస్టర్ విష‌యానికి వ‌స్తే, వెన‌క‌వైపు మెగాస్టార్ చిరంజీవి బొమ్మ ఉన్న ష‌ర్ట్ ధ‌రించి స్టైల్‌గా ఇంట్రడ్యూస్ అయ్యాడు తేజ‌. ఈ సినిమాకు మార్క్ కె. రాబిన్ సంగీతం సమకూరుస్తున్నారు. అనిత్ సినిమాటోగ్రఫీ అందిస్తున్నారు. యాపిల్ ట్రీ స్టూడియోస్ బ్యానర్‌పై రాజశేఖర్ వర్మ నిర్మిస్తున్నారు.