Chiraneevi Sye Raa Movie Review, Live Updates
telangana high court green signal to Chiranjeevi sye raa narasimha reddy movie Release

‘సైరా’ చిత్రం ఇంకొన్ని గంటల్లో విడుదలకానున్న సంగతి తేలీసిందే. దీంతో తెలంగాణ హైకోర్టు చిత్రంపై తమిళనాడు తెలుగు యువత సంఘం అధ్యక్షుడు జగదీశ్వర్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారించి సినిమా విడుదలను ఆపలేమని పిటిషన్‌ను కొట్టివేసింది. మొదట ‘సైరా’ చిత్రం బయోపిక్ అని, ఆ తర్వాత చరిత్ర అంటూ ప్రేక్షకుల్ని తప్పుదోవ పట్టిస్తున్నారని పిటిషన్లో పేర్కొన్నారు కేతిరెడ్డి. విచారణ అనంతరం ఎంతోమంది మహానుభావుల చరిత్రను ఉన్నది ఉన్నట్లు ఎవరూ చూపించలేరని, సినిమాటిక్‌గా ఉండడం కోసం కొంత కల్పితం కూడా ఉంటుందని, సినిమాను వినోదం పరంగానే చూడాలని తెలుపుతూ, ఈ విషయంలో జోక్యం చేసుకోలేమని, సినిమా నచ్చేది, నచ్చనిది ప్రేక్షకుల ఇష్టానికే వదిలేయాలని సూచించింది.

దీంతో చిత్రానికి చట్టపరమైన అడ్డంకులు తొలగిపోయాయి. మరోవైపు తెలుగు రాష్ట్రాల్లో అభిమానులు విడుదలకు భారీ ఎత్తున సన్నాహాలు చేస్తున్నారు. సురేందర్‌ రెడ్డి దర్శకత్వంలో కొణిదెల ప్రొడక్షన్ కంపెనీ బ్యానర్‌పై రామ్ చరణ్ నిర్మిస్తున్న ఈ చిత్రంలో అమితాబ్ బచ్చన్, జగపతిబాబు కిచ్చాసుదీప్, విజయ్ సేతుపతి, నయనతార, తమన్నా కీలక పాత్రల్లో నటించారు. మొత్తం 5 భాషల్లో చిత్రం విడుదలవుతోంది.