famous tollywood actor venugopal kosuri died due to coronavirus

Venugopal Kosuri: కరోనా చాలా మందిని పొట్టన పెట్టుకుంటుంది. ఇప్పటికే సినిమా ఇండస్ట్రీలో కూడా పలువురు ఈ వైరస్ బారిన పడి ప్రాణాలు కోల్పోయారు. తాజాగా మరో ప్రముఖ నటుడు కూడా కరోనాతో చనిపోయాడు. ప్రముఖ సినీ, టీవీ నటుడు కోసూరి వేణుగోపాల్‌ కరోనా బారిన పడి చికిత్స పొందుతూ మరణించారు. హైదరాబాద్‌ గచ్చిబౌలిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో 22 రోజులుగా చికిత్స పొందుతున్న ఆయన ఆరోగ్య పరిస్థితి క్షీణించింది. దీంతో బుధవారం కన్నుమూశారు.

పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం ఈయన స్వగ్రామం. ఎఫ్‌సీఐలో మేనేజర్‌గా పనిచేసి రిటైర్ అయ్యారు. ఉద్యోగం చేస్తూనే సినిమాల్లో నటించేవారు. ఆ తర్వాత రాజమౌళి సినిమాలతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ముఖ్యంగా మర్యాద రామన్న సినిమాలో బ్రహ్మాజీ తండ్రి పాత్రలో అద్భుతంగా నటించాడు ఈయన. వేణుగోపాల్ మృతి పట్ల పలువురు సినీ ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. టాలీవుడ్ మంచి నటుడిని కోల్పోయిందంటూ అనేక మంది తమ సంతాపం ప్రకటించారు.