మొదలు కానున్న “బిగ్ బాస్ 5” కంటెస్టెంట్స్ లిస్ట్..!

0
77
Bigg Boss Telugu Season 5 Contestants Probables List

BIGG BOSS 5: బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం సక్సెస్ ఫుల్‌గా నాలుగు సీజన్స్ పూర్తి చేసుకొని ఇప్పుడు ఐదో సీజన్ జరుపుకునేందుకు సిద్ధమైంది. స్టార్ మా నిర్వహిస్తున్న ఈ బిగ్ బాస్ ఐదవ సీజన్ ఈ ఆదివారం నుండి ప్రసారం కానుంది. సెప్టెంబర్ 5 వ తేదీ సాయంత్రం 6 గంటలకు మొదలు కానున్నట్లు తాజాగా స్టార్ మా వెల్లడించడం జరిగింది.

ఈ సీజన్ కు చాలా ప్రత్యేకతలు ఉండబోతున్నాయట. అందులో ప్రధానమైన ప్రత్యేకత అంటే కంటెస్టెంట్స్. ఈసారి ఉన్న సెలబ్రెటీ కంటెస్టెంట్స్ గత సీజన్ ల్లో లేరని అంటున్నారు. ప్రతి కంటెస్టెంట్ కూడా జనాల్లో బాగా పాపులర్ అయిన వారే అంటున్నారు. గతంలో 40 శాతం మంది కంటెస్టెంట్స్ మాత్రమే జనాలకు తెలిసిన వారు.. మిగిలిన వారు కొద్ది మందిలో గుర్తింపు ఉన్న వారు మాత్రమే.

ఈసారి దాదాపుగా 90 శాతం మందికి అన్ని వర్గాల జనాల్లో ప్రేక్షకుల్లో గుర్తింపు ఉందని అంటున్నారు. గత సీజన్ ల లాగా కాకుండా, ఈ సారి సరికొత్త టాస్క్ లతో కార్యక్రమం మరింత ఆసక్తి కరంగా ఉంటుంది అని తెలుస్తోంది. టాస్క్ లు ఈసారి శారీరకంగా, మానసికంగా సవాల్ విసిరే విధంగా ఉంటాయని తెలుస్తోంది.

telugu bigg boss 5 contestants list

షోలో పాల్గొనే కంటెస్టెంట్స్‌లో లోబో, ఇషా చావ్లా, సీరియల్ హీరో మానస్, సిరి హన్మంత్, యాంకర్ రవి, మోడల్ జశ్వంత్, షన్ముఖ్ జశ్వంత్, ఆర్జే కాజల్, నటి శ్వేత, సీరియల్ నటి ప్రియ, జబర్దస్త్ ఫేమ్ ట్రాన్స్‌జెండర్ ప్రియాంక సింగ్, వర్షిణి, సీరియల్ హీరో వీజే సన్నీ, యానీ మాస్టర్, కార్తీకదీపం భాగ్య (ఉమా), లహరి రాబోతోన్నట్టు తెలుస్తుంది. ప్రియాంక, నవ్యస్వామి, యూట్యూబర్ నిఖిల్, ఆట సందీప్ భార్య జ్యోతి వంటి వారి పేర్లు కూడా వినిపిస్తున్నాయి. వీటిపై పూర్తి క్లారిటీ సెప్టెంబర్ 5న రానుంది. ప్రస్తుతం కంటెస్టెంట్స్ అంతా కూడా క్వారెంటైన్ లో ఉన్నారు.