Balakrishna, Up coming movies, Telugu News
Balakrishna, Up coming movies, Telugu News

బాలకృష్ణ…సీనియర్ హీరోస్ లో సూపర్ స్పీడ్ గా సినిమాలు చేస్తున్నాడు.సినిమా హిట్ అయినా,ప్లాప్ అయినా…ఫలితం ఏదైనా కూడా పట్టించుకోకండా ముందుకు సాగిపోవడం బాలయ్య నైజం.అయితే ఈ మధ్య యంగ్ డైరెక్టర్స్ కి ఫస్ట్ ఛాయిస్ గా మారుతున్నాడు బాలకృష్ణ.

కళ్యాణ్ రామ్ హీరోగా పటాస్ తీసి డైరెక్టర్ గా సూపర్ ఎంట్రీ ఇచ్చిన అనిల్ రావిపూడి ఆ సినిమాలోనే ట్రిబ్యూట్ టు బాలయ్య అంటూ హడావిడి చేసాడు.కానీ అది కళ్యాణ్ రామ్ సినిమా,బాలయ్య పాట వాడుకుంటున్నాడు కాబట్టి అలా అభిమానం చూపించాడు అనుకున్నారు అంతా.కానీ మూడు సినిమాలు హిట్ కొట్టాక బాలయ్య 100 సినిమా కోసం కథ చెప్పిన డైరెక్టర్స్ లో అనిల్ కూడా ఉన్నాడు.అప్పుడు బాలయ్య కి చెప్పిన కథనే మార్చి మహేష్ తో తెరకెక్కిస్తున్నాడు అని టాక్.

[INSERT_ELEMENTOR id=”3574″]

డైరెక్టర్ గా ఇంట్రడ్యూస్ అవుతూనే అ! అనే ప్రయోగాత్మక సినిమా చేసాడు యంగ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ.నాని నే ఇంప్రెస్ అయ్యి స్వయంగా ఆ సినిమాని ప్రొడ్యూస్ చేసాడు.కేవలం క్లయిమాక్స్ తో సినిమా మొత్తానికి జస్టిఫికేషన్ ఇచ్చిన ప్రశాంత్ వర్మ సెకండ్ సినిమా నుండి బాలయ్య జపం చేస్తున్నాడు.సెకండ్ సినిమాకి కల్కి కథను ఎంచుకోవడానికి,అందులో హీరోకి ఒక రేంజ్ ఎలివేషన్ ఇవ్వడానికి కూడా కారణం దాన్ని ఒక లైవ్ డెమో గా చూపించి బాలయ్య తో సినిమా చెయ్యడానికే అనే టాక్ కూడా వినిపిస్తుంది.ఇప్పుడు అది నిజం అయ్యే టైం కూడా వచ్చినట్టుంది.ప్రశాంత్ వర్మ తో బాలయ్య సినిమా దాదాపు ఖాయం…వెయిటింగ్ ఫర్ అఫీషియల్ అనౌన్స్ మెంట్.

[INSERT_ELEMENTOR id=”3574″]

గతంలో బాలయ్యతో చెన్నకేశవరెడ్డి సినిమా తీసిన వినాయక్ బాలకృష్ణ తో ఎలాగయినా సినిమా తియ్యాలని పంతం పట్టినట్టు ఎన్ని కథలు రిజెక్ట్ అవుతున్నా ఇంకా ఇంకా ట్రై చేస్తున్నాడు.ఇప్పుడు ఒక పాయింట్ ఓకే అయితే పరుచూరి బ్రదర్స్ తో ఫుల్ స్క్రిప్ట్ రెడీ చేయిస్తున్నాడు.మరో పక్క బోయపాటి బాలయ్యనే నమ్ముకుని వెయిటింగ్ లో ఉన్నాడు.అలాగే అనిల్ రావిపూడి ప్రస్తుతానికి ఛాన్స్ మిస్ అయినా తరువాత అయినా బాలయ్య తో కన్ఫర్మ్ గా సినిమా చేస్తా అంటున్నాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇలా డైరెక్టర్స్ అంతా బాలయ్య దగ్గరికి క్యూ కట్టడానికి కొన్ని రీజన్స్ కూడా ఉన్నాయి.బాలయ్య కథ విన్నాక నచ్చితే నాన్చడం ఉండదు,వెంటనే గ్రీన్ సిగ్నల్ వచ్చేస్తుంది.ప్రొడ్యూసర్ దగ్గర కూడా పెద్దగా డిమాండ్స్ ఉండవు.అలాగే సినిమా బడ్జెట్ కూడా కంఫర్ట్ గా ఉంటుంది.మార్కెటింగ్ కి ప్రాబ్లెమ్ ఉండదు.డైరెక్టర్ క్లారిటీ గా కథ రాసుకుంటే చాలు బండి నడిచిపోతుంది.సినిమా ఆన్ టైం లో రిలీజ్ అవుతుంది.పైగా డైరెక్టయిర్ వ్యూ ని ఎప్పుడూ కూడా క్వశ్చన్ చెయ్యడు.అందుకే బాలయ్య సినిమాలో చాలా సీన్స్ సిల్లీ గా ఉంటాయి.అతన్ని కరెక్ట్ గా వాడుకుంటే బాక్స్ ఆఫీస్ దగ్గర కనకాభిషేకమే.అందుకే ఏ డైరెక్టర్స్ అంతా జై బాలయ్య అంటున్నారు.మొత్తానికి జెనరేషన్ మారిన ఆఫర్స్ ,క్రేజ్ తగ్గకుండా కెరీర్ కొనసాగిస్తున్న బాలయ్య ని అభినదించాలి.

[INSERT_ELEMENTOR id=”3574″]