తెలుగు సినిమా గ్రేట్…కానీ…?

TFI, Telugu Film Industry Focus, Film Latest Updates, Tollywood Up Coming Movie Dates
TFI, Telugu Film Industry Focus, Film Latest Updates, Tollywood Up Coming Movie Dates

టాలీవుడ్ లో సినిమా తియ్యడం అనేది పెద్ద విషయం కాదు దానిని సరిగ్గా ప్రోమోట్ చేసి అనుకున్న టైం కి,కాస్త పెద్ద రేంజ్ లో ప్రేక్షకుల ముందుకు తీసుకురావడం పెద్ద భారంగా మారింది.కొన్ని సినిమాలు ఒకేసారి వచ్చి నష్టపోతుండడంతో కొంతమంది నిర్మాతలు మాట్లాడుకుని డేట్స్ వేసుకుంటున్నారు.

ఇస్మార్ట్ శంకర్ అండ్ రాక్షసుడు సినిమాల నిర్మాతలు అలా మాట్లాడుకుని రిలీజ్ డేట్ వేశారు.కానీ వరల్డ్ కప్ ఫైనల్ కి ఉన్న క్రేజ్ దృష్ట్యా ఫస్ట్ వీకెండ్ నష్టపోకూడదు అనే థాట్ తో ఇస్మార్ట్ శంకర్ జూన్ 12 నుండి జూన్ 18 కి జంప్ చేసింది.ముందుగా జూన్ 18 లో ఫిక్స్ అయిన రాక్షసుడు టీమ్ ఒక్కసారిగా అలెర్ట్ అయ్యింది.ఇస్మార్ట్ శంకర్ టీమ్ నుండి స్పందన లేకపోవడంతో,ఆ తరువాత కూడా డియర్ కామ్రేడ్ భారీ రిలీజ్ ఉండడంతో ఏకంగా ఆగస్టు కి వెళ్ళింది.ఆగస్టు 2 న వస్తుంది రాక్షసుడు.కానీ అదే రోజు శర్వానంద్ నటించిన రణరంగం రిలీజ్ అవుతుంది.సోలో గా వస్తే రాక్షసుడు సేఫ్ అయ్యే ఛాన్సులు ఉండేవి.ఇప్పుడు అక్కడ టఫ్ కాంపిటీషన్ ఏర్పడింది.

[INSERT_ELEMENTOR id=”3574″]

ఇస్మార్ట్ శంకర్ ఇంపాక్ట్ అక్కడితో ఆగిపోలేదు.ఆ సినిమా ఖాళీ చేసిన ప్లేస్ ని దొరసాని కబ్జా చేసింది.రాజశేఖర్ చిన్న కూతురు శివాత్మిక,విజయ్ దేవరకొండ తమ్ముడు ఫస్ట్ ఎంట్రీ కావడంతో క్రేజ్ ఉంటుంది అనేది టీమ్ ధీమా.అలాగే మూడు బ్యానర్స్ బ్యాక్ అప్ ఉండనే ఉంది.పైగా లవ్ స్టోరీ,స్మాల్ బడ్జెట్…ఇలా అన్ని అంశాలు అనుకూలంగా ఉండడంతో ఆ డేట్ కి ఫిక్స్ అయిపోయారు.అలాగే హీరో సందీప్ కిషన్ కూడా దొరసాని డేట్ కే ఫిక్స్ అయ్యాడు.ఆ డేట్ తప్పితే మళ్ళీ మూడు,నాలుగు వారల వరకు ఖాళీ లేదు.అందుకే జూన్ 12 న రావడానికి రెడీ అయ్యాడు.

[INSERT_ELEMENTOR id=”3574″]

బుర్రకథ కూడా జూన్ 28 న రావాల్సిన సినిమా.కానీ వేరే కారణాలతో పోస్ట్ ఫోన్ అయ్యి ఓ బేబీ రిలీజ్ అవుతున్న జులై 5 నే రిలీజ్ అవుతుంది బుర్రకథ.ఇక నిఖిల్ హీరోగా తెరకెక్కిన అర్జున్ సురవరం మాత్రం ఇప్పటికే నాలుగైదు డేట్స్ మారింది.కానీ రిలీజ్ కాలేదు.ఇప్పటికీ ఎప్పుడు రిలీజ్ అవుతుంది అనే విషయంలో క్లారిటీ లేదు.మళ్ళీ అది సడెన్ గా డేట్ వేస్తే మళ్ళీ అప్పుడు మిగతా సినిమాలు వేరే డేట్ కోసం వెదుక్కోవాలి.ఈ పరిస్థితి ఎదో ఒక్క కారణం మాత్రమే ఉంటే సొల్యూషన్ కూడా ఉండేది.కానీ లెక్కలేనన్ని కారణాలతో ఈ గజిబిజి పజిల్ గా తయారవుతుంది సినిమాల రిలీజ్.బాహుబలి,2.0,మహర్షి లాంటి సినిమాలే అనుకున్న డేట్ కి రానప్పుడు చిన్న ,మీడియం బడ్జెట్ సినిమాలని నిందించడం కరెక్ట్ కూడా కాదు.రిలీజ్ విషయంలో బాలీవుడ్,హాలీవుడ్ రేంజ్ ప్లానింగ్ కి ఎప్పుడు రీచ్ అవుతారో మన వాళ్ళు.

[INSERT_ELEMENTOR id=”3574″]