TFI Actors and Actress Latest Film Updates

టాలీవుడ్ లో స్టార్ హీరోస్ కొంతమందే ఉన్నారు.మిగతా వాళ్ళంతా కూడా మీడియం రేంజ్ అండ్ చిన్న హీరోస్ మాత్రమే.కొత్త హీరోలు వస్తే కొత్త రకం కథలు కూడా వర్క్ అవుట్ అవుతాయి అనే ఒక నమ్మకం ఉంటుంది.కానీ యంగ్ హీరోస్ కథలు ఎంచుకోవడంతో జరుగుతున్న పొరపాట్లతో ఇబ్బందిపడుతున్నారు.

ఉదాహరణకి అఖిల్ ని తీసుకుంటే అక్కినేని ఫ్యామిలీ అనే పెద్ద బ్యాక్ గ్రౌండ్ నుండి వచ్చాడు.దాంతో అతని సినిమాలపై అంచనాలు విపరీతంగా పెరిగిపోయాయి.మెదటి సినిమా నుండి కూడా కథల ఎంపికలో తప్పులు చెయ్యడం,డైరెక్టర్ పనుల్లో వేలు పెట్టడం లాంటి వాటి వల్ల అఖిల్ కోరుకున్న హిట్ ఇంకా దక్కలేదు అని ఇండస్ట్రీ సర్కిల్స్ లో వినిపిస్తున్న మాట.సినిమా సినిమాకి ఒక సంవత్సరం గ్యాప్ తీసుకుంటున్న అఖిల్ హిట్ కొట్టేదెప్పుడో అని వెయ్యి కళ్ళతో ఎదురుచుతున్నారు ఫ్యాన్స్.

గీత ఆర్ట్స్ అనే బ్లాక్ బస్టర్ సంస్థ బ్యాక్ అప్ తో హీరో అయ్యాడు అల్లు శిరీష్.ఒక పక్క అల్లు అర్జున్ సలహాలు ఇస్తున్నా,మరో పక్క స్వంత ప్రొడక్షన్ హౌస్ సినిమాలు నిర్మిస్తున్నా కూడా ఇంకా షైన్ అవ్వలేదు.అతని కెరీర్ లో శ్రీరస్తు-శుభమస్తు అనే హిట్ ఉన్నా కూడా అది డైరెక్టర్ పరశురామ్ వల్ల వచ్చిందే తప్ప శిరీష్ స్పార్క్ వల్ల కాదు అని చెప్పుకుంటారు.కొంతమంది ఒప్పుకుంటారు కూడా.మరి హీరో గా ఈ చినబాబు ఎప్పటికి షైన్ అవుతాడు అనేది చూడాలి.

నారా రోహిత్…ఎప్పుడో హీరో గా వచ్చాడు. నారా రోహిత్ కి బాలయ్య సపోర్ట్ ఉండడం వల్ల నందమూరి అభిమానుల మద్దతు కూడా ఉంటుంది.కానీ లక్ ఫ్యాక్టర్ చాలా తక్కువ.అందుకే సోలో అనే సోలో హిట్ తప్ప మరో చెప్పుకోదగ్గ విజయం ఒకటీ లేదు.రోహిత్ మంచి సినిమాల్లో నటిస్తాడు అనే మాట వినిపిస్తుంది.కానీ ఆ జోరు బాక్స్ ఆఫీస్ లెక్కల్లో కనిపించదు.

ఆది…సాయి కుమార్ తనయుడు అయిన ఇతనికి కెరీర్ కూడా ఇంకా గాడిలో పడలేదు.మొదటి సినిమా హిట్ అనిపించారు,ఆ తరువాత లౌలీ అనే సినిమా ఓకే అనిపించుకుంది.అంతకుమించి ఆది నటించిన ఏదైనా సినిమా గుర్తు తెచ్చుకోవాలి అంటే టైం పడుతుంది.ఆది తన పేరుని ఆది సాయి కుమార్ అని మార్చుకున్నాడు కానీ రిజల్ట్ మాత్రం రిపీట్ అవుతూనే ఉంది.కనీసం రిలీజ్ కి రెడీ అయిన ఆపరేషన్ గోల్డ్ హిట్ అయితే అది రాత మారే అవకాశం ఉంది.సందీప్ కిషన్…ఇతని ఎనర్జీ ఉంది,కాస్త మంచి సినిమా పడితే లాభాలు తెచ్చిపెట్టగల సత్తా ఉంది.కానీ సినిమాల ఎంపికలో తప్పులు జరుగుతూనే ఉన్నాయి.దీంతో అతని సినిమా రిలీజ్ అయిన నాలుగురోజులు మాత్రమే అతను ఇండస్ట్రీ లో ఉన్నాడు అని గుర్తిస్తారు జనాలు.

వెంకటాద్రి ఎక్స్ప్రెస్ లాంటి హిట్ ఉన్నా కూడా దాన్ని నిలబెట్టుకోలేకపోవడంతో ఇంకా ప్రయోగాల దశలోనే ఉన్నాడు.శ్రీవిష్ణు…నారా రోహిత్ కి బెస్ట్ ఫ్రెండ్ అయిన శ్రీవిష్ణు కూడా అతని దారిలోనే ప్రయాణిస్తున్నాడు.మంచి సినిమాలు ఎంచుకుంటాడు.వీలయినంతవరకు మంచి కంటెంట్ అందించడానికి ప్రయత్నిస్తాడు కానీ ఉపయోగం ఉండదు.బొటాబొటీ విజయాలే తప్ప పలానా సినిమా సూపర్ హిట్ అని చెప్పుకోవడానికి లేదు.అతను కూడా ఆ హిట్ ని వెదుక్కుంటూనే అతని ప్రయాణాన్ని కొనసాగిస్తున్నాడు.అదెప్పుడు దక్కుతుంది అనే విషయం మాత్రం ఎవ్వరూ చెప్పలేరు.

చిరు చిన్నల్లుడు కళ్యాణ్ దేవ్, నవదీప్ ఇలా సీజనల్ హీరోస్ చాలా మంది సైడ్ ట్రాక్ లో ఉన్నారు.తరుణ్,తనీష్,వరుణ్ సందేశ్ లాంటి బ్యాచ్ అంతా ఫేడ్ అవుట్ ఎడ్జ్ లో ఉన్నారు.ఇలా ఎందుకు జరుగుతుంది అనే విషయం మాట్లాడితే ఒక పుస్తకం రాయొచ్చు.కానీ వీళ్లంతా హిట్స్ తో చెలరేగితే మాత్రం తెలుగు ఇండస్ట్రీ కళకళలాడుతుంది.స్టార్ హీరోస్ లా వీళ్లకు రిస్ట్రిక్షన్స్ లేవు,అందుకే వాళ్ళు హీరోస్ అనే విషయం పక్కనబెట్టి సినిమాలు చేసుకుంటూ వెళితే స్టార్స్ సినిమాల కోసం ప్రేక్షకులు ఎదురుచూడాల్సిన పని ఉండదు.ఈ సత్యం గ్రహించి వీళ్ళు ఎప్పటికి మారతారో?,ఎప్పుడు ట్రాక్ ఎక్కుతారో చూడాలి.