Telugu Film Industry Welcome For Actress, Film Updates, Stills
Telugu Film Industry Welcome For Actress, Film Updates, Stills

టాలీవుడ్ కి హీరోయిన్స్ కొరత అనేది రెగ్యులర్ అండ్ కామన్ ప్రాబ్లెమ్.అయితే గతంలో ఎక్కువగా సీనియర్ హీరోలకు మాత్రమే ఈ ప్రాబ్లెమ్ ఉండేది.కానీ ఇప్పడు మాత్రం ఏజ్ గ్రూప్ అండ్ బిజినెస్ రేంజ్ తో సంబంధం లేకుండా ఈ సమస్య ఉంటుంది.

రీసెంట్ గా చూసుకుంటే అఖిల్ అక్కినేని ఇప్పటివరకు మూడు సిమిమాలు చేసాడు.కానీ అఖిల్ కి తగ్గ అమ్మాయి,అతని పక్కనే సెట్ అయ్యే హీరోయిన్ ని వేడికి పట్టుకోవడం చాలా కష్టమైంది.మొదటి రెండు సినిమాలకు కొత్త హీరోయిన్స్ ని వెదికిపట్టుకున్నారు.మూడో సినిమాకి నిధి అగర్వాల్ ని తీసుకున్నారు.కానీ వాళ్ళ పెయిరింగ్ కి నెగెటివ్ ఫీడ్ బ్యాక్ వచ్చింది.అందుకే అఖిల్ కొత్త సినిమా కోసం హీరోయిన్ విషయం తేలేవరకు సెట్స్ పైకి వెళ్లడం కష్టమే.

సాయి ధరమ్ తేజ్ కి కూడా హీరోయిన్ ని సెట్ చెయ్యడం కష్టం అవుతుంది.ఇప్పటికే రెజీనా,రాశి ఖన్నా,మెహ్రీన్ లాంటి వాళ్ళతో సినిమాలు చేసాడు.దానికి తోడు సాయి ధరమ్ మార్కెట్ కూడా బాగా డల్ అయ్యింది.అందుకే పెద్ద హీరోయిన్స్ ని పెట్టుకునే ఛాన్స్ లేదు.చిత్రలహరి కోసం డబ్బు డిమాండ్ చెయ్యని కళ్యాణి ప్రియదర్శిని,నివేతా పేతురాజ్ లను తీసుకున్నారు.మళ్ళీ తేజు మారుతీ తో చేస్తున్న ప్రాజెక్ట్ కూడా హీరోయిన్ అనే పాయింట్ దగ్గరే లేట్ అవుతుంది.

మహేష్ బాబు లాంటి స్టార్ హీరోకి కూడా ఈ ప్రాబ్లెమ్ తప్పట్లేదు.భరత్ అనే నేను సినిమాకి సమంత మాత్రమే సోలో ఆప్షన్ గా కనిపిస్తే బాలీవుడ్ నుండి కియారా ని తీసుకున్నారు.మహర్షి కోసం ఫామ్ లో ఉన్న పూజ హెగ్డే ని తీసుకున్నారు.నెక్స్ట్ సినిమా హీరోయిన్ కోసం మాత్రం ఇంకా వెయిటింగ్ లో ఉన్నారు.సాయి పల్లవి,రష్మిక మందన్న ఇలా పేర్లు వినిపించాయికానీ ఫైనల్ అవ్వలేదు.

బన్నీ పరిస్థితి కూడా అంతే.త్రివిక్రమ్ తో సినిమా స్టార్ట్ అయ్యి సెట్స్ మీదకి వెళ్ళింది.కానీ ఇంకా సెకండ్ హీరోయిన్ దొరకలేదు.

RRR సినిమా ఆగడానికి కారణం రామ్ చరణ్ ఇంజ్యురీ అయితే ఇంకా మొదలుకాకపోవడానికి మాత్రం హీరోయిన్ అని తెలుస్తుంది.ఈ సినిమాలో NTR సరసన నటించే హీరోయిన్ గా డైసీ ఎడ్గర్ జోన్స్ ని తీసుకున్నారు.కానీ ఆమె సినిమా నుండి తప్పుకుంది.మళ్ళీ హీరోయిన్ దొరకలేదు.400 కోట్ల భారీ ప్రాజెక్ట్ కి కూడా ఈ కష్టం తప్పట్లేదు.

నాని తో సినిమాలు చేసే వాళ్ళు బడ్జెట్ కంట్రోల్ కోసం కొత్త హీరోయిన్స్ ని తీసుకోవాల్సి వస్తుంది.మజ్ను టైం కి అను ఇమ్మానుయేల్ కొత్తమ్మాయి అయినా తీసుకున్నారు.కృష్ణార్జున యుద్ధం సినిమాకి హీరోయిన్స్ కూడా మైనస్ అనే టాక్ బాగా వినిపించింది.జెర్సీ కి క్యారెక్టర్ పరంగా ఎవరూ చెయ్యడానికి ముందు రాలేదు అని చెబుతున్నా బడ్జెట్ కూడా లెక్కేసుకుని శ్రద్దా శ్రీనాథ్ ని తీసుకున్నారు.జెంటిల్ మ్యాన్ టైం కి నివేతా న్యూ కమర్,సురభి ఇంకా బడ్డింగ్ స్టేజ్,కానీ తప్పలేదు.ఈ మధ్య కాలంలో నాని ఎస్టాబ్లిష్డ్ హీరోయిన్స్ తో కంటే కొత్త వాళ్ళతోనే ఎక్కువగా అడ్జస్ట్ అయ్యాడు.

సీనియర్ హీరోస్ ని తీసుకుంటే మన్మధుడు-2 కి హీరోయిన్ దొరకలేదు.దాంతో నాగ్ ఏజ్ కి సంబంధం లేని రకుల్ ని తీసుకున్నారు.

అలాగే వెంకీమామలో వెంకటేష్ సరసన పాయల్ రాజపుత్ నటిస్తుంది.

ఇక బాలయ్య కొత్త సినిమా లో అయితే హరిప్రియ,పాయల్ హీరోయిన్స్.వాళ్ళ ఏజ్ బాలయ్య ఏజ్ లో సగం కూడా ఉండదు.

రవితేజ అయితే నెల టికెట్ సినిమాలో టీనేజర్ అయిన మాళవిక శర్మ తో జతకట్టాడు.ఆ జోడి స్క్రీన్ పై చాలా ఆడ్ గా అనిపించింది.శ్రీయ,నయనతార,అనుష్క,త్రిష లాంటి హీరోయిన్స్ రకరకాల కారణాలతో అందుబాటులో లేకపోవడంతో సీనియర్ హీరోస్ కి ఈ పరిస్థితి వచ్చింది.

రాజ్ తరుణ్ కి సినిమా సెట్ చెయ్యడం కంటే హీరోయిన్ ని సెట్ చెయ్యడం కష్టమయిన పనిగా మారింది.ఆది సాయి కుమార్ లాంటి యంగ్ హీరోస్ నుండి రాజశేఖర్ లాంటి సీనియర్ హీరోస్ వరకు ఇదే ఇబ్బంది.

బెల్లంకొండ శ్రీనివాస్,శర్వానంద్ లాంటి యంగ్ హీరోస్ సైతం మెగాస్టార్ తో సైతం నటించిన కాజల్ ని హీరోయిన్ గా తీసుకున్నారు అంటే సిట్యుయేషన్ అర్ధమవుతుంది.

సమంత ఒక టైప్ ఆఫ్ సినిమాలకి పరిమితం అయ్యింది.కాజల్ ఫేడ్ అవుట్ ఎడ్జ్ లో ఉండు.పూజా హెగ్డే లాంగ్ రన్ కష్టం…రష్మిక,మెహ్రీన్,రకుల్,రాసి ఖన్నాలతోపాటు మరికొంతమంది సీజనల్ హీరోయిన్స్ మాత్రమే ఛాయస్ గా మిగిలారు.టాలెంట్ ఉన్న హీరోయిన్స్ టాలీవుడ్ ఎంట్రీ కి ఇది పర్ఫెక్ట్ టైం.