హీరో సాయిధరమ్ తేజ్‌కు ప్రమాదం..!

0
1299
Hero Sai Dharam Tej Inured in Road accident

Sai Dharam Tej: ‘మెగా’ నటుడు సాయిధరమ్‌ తేజ్‌ రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. శుక్రవారం స్పోర్ట్స్‌ బైక్‌పై ప్రయాణిస్తున్న ఆయన ప్రమాదవశాత్తూ కిందపడిపోయారు. ఈ ఘటనలో సాయిధరమ్‌ తేజ్‌కు తీవ్రగాయాలు అయ్యాయి. కన్ను, ఛాతి, పొట్టపై తీవ్రగాయాలు కావడంతో హుటాహుటినా హైటెక్ సిటీలోని మెడీకవర్ ఆస్పత్రికి తరలించినట్టు సమాచారం. ప్రస్తుతం సాయి ధర్మ తేజ్ అపస్మార స్థితిలోకి వెళ్లిపోయినట్టు తెలుస్తోంది.

నగరంలోని కేబుల్‌ బ్రిడ్జ్‌-ఐకియా సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు హుటాహుటిన ప్రమాద ప్రాంతానికి చేరుకుని, సాయిధరమ్‌ తేజ్‌ను ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స కొనసాగుతోంది.

రోడ్ నెంబర్ 45 కేబుల్ బ్రిడ్జిపై ప్రమాదం జరిగినట్టు తెలుస్తోంది. షూటింగ్ సమయంలో ప్రమాదం జరిగిందా లేదా ప్రమాదవశాత్తూ జరిగిందా? అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ఆస్పత్రిలో సాయిధరమ్‌కు చికిత్స పొందుతుండగా.. తేజ్ ఆరోగ్య పరిస్థితి నిలకడగానే ఉన్నట్టు తెలుస్తోంది.

Update: సాయి ధరమ్ తేజ్ తాజా హెల్త్ బులిటెన్‌.!

Hero Sai Dharam Tej Inured in Road accident Photos