‘మహాసముద్రం’ నుంచి ట్రైలర్ రిలీజ్!

0
955
Sharwanand Maha Samudram Trailer Talk

Maha Samudram Trailer: వర్సటైల్ యాక్టర్స్ శర్వానంద్ – బొమ్మరిల్లు సిద్ధార్థ్ హీరోలుగా అజయ్ భూపతి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ”మహాసముద్రం”. ఈ చిత్రాన్ని అక్టోబర్ 14న విడుదల చేయబోతున్నారు. ఈరోజున మహా సముద్రం థియేట్రికల్ ట్రైలర్ ను విడుదల చేసారు.

‘సముద్రం చాలా గొప్పది.. చాలా రహస్యాలు తనలోనే దాచుకుంటుంది’ అని శర్వానంద్ చెప్పే డైలాగ్ తో ఈ ట్రైలర్ ప్రారంభమైంది. ‘నువ్వు సముద్రం లాంటి వాడివి అర్జున్.. నీలో కలవాలని అన్నీ నదులు కోరుకుంటాయ్’ అని అదితి తన అమాయకపు స్వభావాన్ని వెల్లడించింది.

‘ఇక్కడ మనకు నచ్చినట్టు బ్రతకాలంటే.. మన జాతకాన్ని దేవుడు మందు కొట్టి రాసుండాలి’ అని సశర్వా చెప్తుండటంతో అతని జీవితంలో ఏదో జరిగిందనేది అర్థం అవుతోంది. అజయ్ భూపతి తన ఇమేజ్ కు తగ్గట్లుగానే మరో ఇంటెన్స్ కథతో మన ముందుకు వస్తున్నట్లు ట్రైలర్ చూస్తే అర్ధమవుతోంది.

Sharwanand Maha Samudram Trailer Talk

శర్వానంద్, సిద్ధార్థ్, అను ఇమ్మాన్యుయేల్, అదితి రావు హైదరి, జగపతి బాబు, రావు రమేష్ ఇలా అందరి పాత్రలూ ఇంటెన్స్ గానే ఉన్నాయి. చైతన్ భరద్వాజ్ ఇచ్చిన బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్, కెమెరా వర్క్ కూడా ట్రైలర్ లో ప్రధాన ప్లస్ పాయింట్స్ గా నిలిచాయి.

Also Read: శర్వానంద్ ‘ఆడవాళ్ళు మీకు జోహార్లు’ షూటింగ్ ప్రారంభం..!

‘Rx100’ వంటి విభిన్నమైన సినిమా తర్వాత దర్శకుడు అజయ్ భూపతి మరోసారి తన వినూత్నమైన కథ కథనాలతో.. అద్భుతమైన టేకింగ్ తో ఆశ్చర్యపరిచేందుకు సిద్ధంగా ఉన్నారని ‘మహా సముద్రం’ ట్రైలర్ చూస్తే తెలుస్తోంది. మొత్తంగా మహా సముద్రం అంచనాలను ఈ ట్రైలర్ తో రెట్టింపు చేసుకుంది.

 

Previous articlePellisandaD Heroine SreeLeela at KLM Mall Photos
Next articleLove Story Review: Engaging to an extent