సర్కారు వారి పాట మరో `పోకిరి`.. మహేష్‌ కామెంట్స్

0
1533
Mahesh Babu Comments on Rajamouli dream project and sarkaru vaari paata shooting

Mahesh babu Sarkaru Vaari Paata: సూపర్ స్టార్ మహేష్ బాబు తన డ్రీమ్ ప్రాజెక్ట్ గురించి చెప్పారు. ప్రస్తుతం పరశురామ్‌ దర్శకత్వంలో `సర్కారు వారి పాట` చిత్రంలో నటిస్తున్నారు. కీర్తిసురేష్‌ హీరోయిన్‌గా నటిస్తున్న చిత్రమిది. ప్రస్తుతం శరవేగంగా చిత్రీకరణ జరుపుకుంటోంది.

మహేష్‌ `బిగ్‌సి` సెల్‌ఫోన్స్ సంస్థకి బ్రాండ్‌ అంబాసిడర్‌గా ఎంపికయ్యారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. మహేష్‌ ఆపిల్‌ ఫోన్‌ ఫ్యాన్ అని, ఏ కొత్త ప్రొడక్ట్ లాంచ్‌ అయినా కొంటానని తెలిపారు. ఇందులో భాగంగా శుక్రవారం ఏర్పాటు చేసిన ప్రెస్‌మీట్‌లో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.

పరశురామ్‌ డైరెక్షన్‌లో వస్తున్న సినిమా `పోకిరి` లాగా సినిమా ఉండబోతుందనే టాక్‌ వినిపిస్తుంది. మీరేమంటారనే ప్రశ్నకి మహేష్‌ స్పందిస్తూ, ఆ వార్త నిజమే అని, ఇది కచ్చితంగా `పోకిరి` తరహాలో ఉండబోతుందని తెలిపారు.

తాను అనుకుంటున్న డ్రీమ్ ప్రాజెక్టుల్లో దర్శక ధీరుడు రాజమౌళితో దర్శకత్వంలో ఓ ప్రాజెక్టు చేయడం ఒకటని చెప్పారు. త్వరలో దీనికి సంబంధించిన అప్డేట్‌ రాబోతుందన్నారు. కథపై చర్చించబోతున్నామని, రాజమౌళితో చేయాలని ఎప్పటి నుంచో అనుకున్నాం. అది అందరికి తెలిసిందే. నాకిది ఒక కల నెరవేరిన ఫీలింగ్‌ అని చెప్పారు.

Also Read: Love Story Day 1 Box Office Collections

Mahesh Babu Comments on Rajamouli dream project and sarkaru vaari paata shooting

ఇప్పుడు మహేష్ స్వయంగా ఈ టాపిక్ తీయడంతో.. రాజమౌళి- మహేష్ కాంబీలో మూవీ వస్తే రికార్డులు బ్రేక్ కావడం ఖాయం అని చెప్పుకుంటున్నారు ప్రేక్షకులు.

Also Read: బేబమ్మతో సినిమా చేయనంటున్న విజయ్ సేతుపతి 

 

Previous articleLove Story Day 1 Box Office Collections
Next articleనాగ్ ఇచ్చిన డిన్నర్ పార్టీ లో సమంత ఎక్కడ..?