మోస్ట్ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్ ట్రైలర్: అఖిల్, పూజ సందడి

0
897
Most Eligible Bachelor Theatrical Trailer Out Now

Most Eligible Bachelor Trailer: అఖిల్‌ హీరోగా నటించిన ‘మోస్ట్‌ ఎలిజిబుల్ బ్యాచ్‌లర్‌’ రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ గా వస్తున్న ఈ సినిమా ట్రైలర్ ను తాజాగా విడుదల చేశారు. బొమ్మరిల్లు భాస్కర్‌ తెరకెక్కిస్తోన్న చిత్రమిది. పూజా హెగ్డే కథానాయిక.

కొవిడ్‌ కారణంగా వాయిదాపడుతూ వస్తున్న ఈ చిత్రం అక్టోబరు 15న విడుదల కాబోతుంది. ఈ నేపథ్యంలో చిత్ర బృందం ట్రైలర్‌ని విడుదల చేసింది. ఈ చిత్రం సక్సెస్ ఇచ్చేలా అంచనాలు పెంచింది ట్రైలర్.. లవ్‌, కామెడీ అంశాలతో ఆసక్తిగా రేకెత్తించగా.. అఖిల్, పూజా హెగ్డే జోడీ స్క్రీన్ ఫెయిర్ బాగుంది.

‘మన లైఫ్‌ పార్టనర్‌తో కనీసం 9000 సార్లు కలిసి పడుకోవాలి, వందల వెకేషన్స్‌కి వెళ్లాలి. అన్నింటికీ మించి కొన్ని లక్షల కబుర్లు చెప్పుకోవాలి. అలాంటి వాడు ఎవడు’ అని ఎదురుచూస్తుంటుంది పూజా. ఇక ట్రైలర్ మధ్యలో జాతిరత్నాలు ఫ్రేమ్ ఫరియా, ఈషా రెబ్బా కనిపించారు.

Most Eligible Bachelor Theatrical Trailer Out Now

ఈ జనరేషన్ ఆడియన్స్‌కు నచ్చేలా కథను తీసుకొస్తున్నాడు దర్శకుడు బొమ్మరిల్లు భాస్కర్.. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన టీజర్, పాటలకు భారీ రెస్పాన్స్ వచ్చింది. అల్లు అరవింద్ సమర్పణలో జీఏ2 పిక్చ‌ర్స్ బ్యాన‌ర్ రూపొందిస్తున్న ఈ మూవీని బన్నీ వాసు, మరో నిర్మాత ప్ర‌ముఖ ద‌ర్శ‌కుడు వాసు వర్మతో కలిసి సంయుక్తంగా నిర్మిస్తున్నారు.

టీజర్ కోసం ఇక్కడ క్లిక్ చెయ్యండి

 

Web Title: Most Eligible Bachelor Theatrical Trailer Out Now

Previous articleMost Eligible Bachelor Theatrical Trailer
Next articleRepublic Review And Rating