సక్సెస్‌ఫుల్ మాస్‌ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్..!

0
601
Ram Pothineni and boyapati movie on cards

RAPO20: ఎనర్జిటిక్ హీరో రామ్ పోతినేని.. ప్రస్తుతం కోలీవుడ్ డైరెక్టర్ లింగుస్వామితో కలిసి తన 19 సినిమా చిత్రీకరణలో బిజీ గా ఉన్నారు. ఈ యాక్షన్ ఎంటర్టైనర్ లో హీరో రామ్ తో రొమాన్స్ చేసేందుకు ఉప్పేన ఫేమ్ కృతి శెట్టి సిద్ధమయ్యారు. ఇటు ప్రేమ కథా చిత్రాలతో పాటు, ‘ఇస్మార్ట్‌ శంకర్’ వంటి మాస్‌ మసాలా కథల్లో ఆయన ఇట్టే ఇమిడిపోతారు.

తాజాగా రామ్ 20వ సినిమా పై టాలీవుడ్ లో కొన్ని వార్తలు వినిపిస్తున్నాయి. రామ్‌ తన తర్వాతి చిత్రాన్ని ‘మాస్‌ కా బాస్‌’ డైరెక్టర్ బోయపాటి దర్శకత్వంలో నటిస్తారని తాజా సమాచారం. పక్కా మాస్‌ ఎంటర్‌టైనర్‌గా ఈ సినిమా తెరకెక్కించనున్నారట.

బోయపాటి తన స్క్రిప్ట్ ను వినిపించేందుకు హీరో రామ్ ను చాలాసార్లు కలిశారని సమాచారం. ఈ ప్రాజెక్ట్ కోసం ఈ యంగ్ హీరో సైన్ చేశాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఈ ప్రాజెక్టును “బీబీ3” నిర్మాత మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తారని టాక్.

Also Read: 1970 బ్యాక్‌డ్రాప్‌ లో ప్రభాస్ సలార్‌ మూవీ…?

Ram Pothineni and boyapati movie on cards

దీనిపై స్పష్టత రావాలంటే ఇంకొన్ని రోజులు వేచి చూడాల్సిందే. అఖండ’ను పూర్తి చేసే పనిలో ఉన్నారు. త్వరలోనే కొత్త చిత్రంపై స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

 

Previous articleరివ్యూ: లవ్‌స్టోరి
Next articleపుష్ప సెకండ్ సింగిల్‌పై లేటెస్ట్ అప్‌డేట్..!