నాగ్ ఇచ్చిన డిన్నర్ పార్టీ లో సమంత ఎక్కడ..?

0
145
Samantha Akkineni is missing Dinner Party Hosted By Nagarjuna Family with Love Story Team

Samantha Akkineni: రెండు నెలల నుండి సమంత, నాగ చైతన్యల (Naga Chaitanya) సంసార జీవితం పై రకరకాల వార్తలు ప్రచారం అవుతూనే ఉన్నాయి.ఆ వార్తలతో ఈ ఇద్దరూ విడిపోవడం ఖాయమని ఇప్పుడు అందరూ అనుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఇటీవల హైదరాబాద్ లో నాగ చైతన్య నటించిన ‘లవ్ స్టోరీ’ సినిమా ప్రీ రిలీజ్ ఈవెంట్ జరిగింది.

ఆ సినిమా ప్రీ రిలీజ్‌ వేడుకకు గౌరవ అతిథిగా విచ్చేసిన ఆమిర్‌ఖాన్‌కి నాగార్జున ఫ్యామిలీ స్పెషల్‌ డిన్నర్‌ పార్టీ ఇచ్చింది. ఈ పార్టీకి నాగార్జున, నాగచైతన్య, అఖిల్‌తోపాటు దర్శకుడు శేఖర్‌ కమ్ముల, సాయిపల్లవి హాజరై సరదాగా గడిపారు.

తాజాగా ఈ ఫొటో బయటకు వచ్చింది. ఇందులో సమంత కనిపించకపోవడం గమనార్హం. ఇక ఆ ఫోటోల్లో వారంతా చాలా హ్యాపీ టైమ్ ను ఎంజాయ్ చేస్తున్నట్లు కనిపించారు.అయితే ఆ పార్టీలో సమంత లేకపోవడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.

Samantha Akkineni is missing Dinner Party Hosted By Nagarjuna Family with Love Story Team

దీంతో సమంత అక్కినేని ఫ్యామిలీ లో మెంబర్ కాదనే విషయాన్ని ఈ ఫోటోలు తెలుపుతున్నాయని టాలీవుడ్ జనాలు అంటున్నారు. వరుస సంఘటనలు గమనిస్తుంటే నాగ చైతన్యతో కలిసే ఉద్దేశం సమంతకు లేదని అనిపిస్తుంది. అదే సమయంలో చైతూ కూడా అదే కోరుకుంటున్నారని భావించవచ్చు. అక్టోబర్ 6న సమంత చైతు పెళ్లి రోజు నేపథ్యంలో ఆరోజు మరింత స్పష్టత వచ్చే అవకాశం కలదు.

 

Previous articleసర్కారు వారి పాట మరో `పోకిరి`.. మహేష్‌ కామెంట్స్
Next articleVaishnav Tej KondaPolam locked Trailer Release Date