పుష్ప సెకండ్ సింగిల్‌పై లేటెస్ట్ అప్‌డేట్..!

0
1477
Sid Sri Ram Sung Second Song From Movie Allu Arjun Pushpa

Pushpa Second Song: అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్‌లో వస్తోన్న లేటెస్ట్ మూవీ ‘పుష్ప’. ఎర్ర చందనం బ్యాక్‌డ్రాప్‌లో రూపొందుతున్న ఈ సినిమా నుంచి ‘దాక్కో దాక్కో మేక’ అనే పాట విడుదల చేశారు మేకర్స్. దాక్కో దాక్కో మేక అంటూ సాగే ఈ పాట అన్ని భాషల్లో కూడా హిట్ అయింది.

ఈ సినిమాలో రష్మిక మందన్న హీరోయిన్ గా నటిస్తోంది. గంధపు చెక్కల స్మగ్లింగ్ నేపధ్యంలో తెరకెక్కుతున్న ఈ సినిమాకు సంబంధించిన లుక్స్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. ముఖ్యంగా అల్లు అర్జున్ పుట్టిన రోజు సందర్భంగా విడుదలైన సినిమా టీజర్ ప్రేక్షకులను అమితంగా అలరించింది.

తాజాగా ఈ సినిమా నుంచి సెకెండ్ సింగిల్ గురించి వార్తలు సోషల్‌మీడియాలో వైరల్ అవున్నాయి. ఈ పాటని ప్రముఖ గాయకుడు సిద్ శ్రీరామ్‌తో సంగీత దర్శకుడు దేవి శ్రీ ప్రసాద్ పాడించారు అని తెలుస్తోంది.

Also Read: సక్సెస్‌ఫుల్ మాస్‌ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్..! 

Sid Sri Ram Sung Second Song From Movie Allu Arjun Pushpa

ఈ మధ్యకాలంలో వీరిద్దరు కలిసి దిగిన ఫోటోలు పోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. మరి దీనిపై కారిటీ రావాలి అంటే కొంత కాలం వేచి చూడాల్సిందే. ఇక ఈ సినిమా క్రిష్మస్ కానుకగా రిలీజ్ కాబోతుంది.

 

Previous articleసక్సెస్‌ఫుల్ మాస్‌ డైరెక్టర్‌తో రామ్ పోతినేని నెక్ట్స్..!
Next articleKeerthy Suresh at CMR Shopping Mall Opening Pics