‘పెళ్లి సందD’ రివ్యూ & రేటింగ్

0
6754
pelli sandadi movie review in telugu

Pelli SandaD Telugu Movie Review Rating
రేటింగ్ : 2.25/5
నటీనటులు: రోష‌న్, శ్రీ‌లీల, ప్ర‌కాశ్‌రాజ్‌, రాజేంద్ర ప్ర‌సాద్‌, రావు ర‌మేష్‌,
దర్శకుడు: గౌరీ రోణంకి
నిర్మాతలు: మాధ‌వి కోవెల‌మూడి, శోభు యార్ల‌గడ్డ‌, ప్ర‌సాద్ దేవినేని
సినిమాటోగ్రఫీ: సునీల్ కుమార్ నామ
సంగీత దర్శకుడు: ఎం.ఎం.కీర‌వాణి

1996లో శ్రీకాంత్‌, దీప్తి భ‌ట్నాగ‌ర్‌, ర‌వ‌ళి హీరో హీరోయిన్లుగా ద‌ర్శ‌కేంద్రుడు కె.రాఘ‌వేంద్ర‌రావు ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన లో బ‌డ్జెట్ మూవీ ‘పెళ్లి సంద‌డి’. శ్రీకాంత్ కెరీర్ లో బిగ్గెస్ట్ హిట్ అయిన పెళ్లి సందడికి కొత్త వెర్షన్ రోషన్ హీరోగా యువ నటి శ్రీ లీల హీరోయిన్ గా నటించిన లేటెస్ట్ చిత్రం “పెళ్లి సందD”. కాగా ఈ చిత్రం ఈ రోజే విడుదల అయింది. మరి ప్రేక్షకులును ఏ మేరకు మెప్పించిందో సమీక్షలోకి వెళ్లి తెలుసుకుందాం.

కథ:
వశిష్ట (రోషన్) తనకు నచ్చిన అమ్మాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని నిర్ణయించుకుంటాడు. ఈ క్రమంలో తన బ్రదర్ పెళ్ళికి వెళ్తాడు. అక్కడ సహస్ర (శ్రీలీల)ను చూసి ప్రేమలో పడతాడు. ఆమె కూడా వశిష్టను చూసి ప్రేమిస్తోంది. ఎంతో సరదాగా మొదలైన వీరి ప్రేమ కథలో వచ్చిన సమస్య ఏమిటి ? వీరి ప్రేమకు అడ్డు ఏమిటి ? చివరకు వశిష్ట తన ప్రేమను గెలిపించుకోవడానికి ఏమి చేశాడు ? లాంటి విషయాలు తెలియాలంటే ఈ చిత్రం చూడాల్సిందే.

pelli sandadi movie review in telugu

నటీనటులు:
ఫ్యామిలీ స్టార్ శ్రీకాంత్ వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన రోషన్ తన పాత్రకు తగ్గట్లు బాగా నటించాడు. ముఖ్యంగా డైలాగ్ డెలివరీతో అలాగే డాన్స్ తో ఆకట్టుకున్నాడు. రాఘ‌వేంద్ర‌రావు న‌టుడిగా తొలి సినిమా. ఆయ‌న త‌న పాత్ర ప‌రిధి మేర న‌టించారు. శ్రీలీల కూడా అంతే మంచి న‌ట‌న‌తో పాటు గ్లామ‌ర్‌గానూ క‌నిపించింది.

హీరోయిన్ కి తండ్రిగా నటించిన ప్రకాష్ రాజ్, ఇతర కీలక పాత్రల్లో నటించిన రావు రమేష్, రఘుబాబు ఎప్పటిలాగే తమ కామెడీ ఎక్స్ ప్రెషన్స్ తో, తమ శైలి మాడ్యులేషన్స్ తో సినిమాలో కనిపించనంత సేపూ నవ్వించే ప్రయత్నం చేశారు.

pelli sandadi movie review in telugu

విశ్లేషణ:
హీరో రోష‌న్‌, హీరోయిన్ శ్రీలీల పెళ్లి చుట్టూ తిరిగే క‌థ కావ‌డంతో ఈ సినిమాకు ‘పెళ్లి సందD’ అనే టైటిల్ పెట్టారు. వీరి జోడీ చూడ‌టానికి చ‌క్క‌గా ఉంది. రోష‌న్ కూడా హీరోగా తొలి సినిమానే అయినా చ‌క్క‌గా న‌టించాడు. అదే విధంగా సెకెండ్ హాఫ్ లో కొన్ని కీలక సన్నివేశాల్లో తన హావభావాలతో చక్కని పెర్ఫార్మెన్స్ కనబర్చాడు.

రొటీన్ స్టోరి, పాత్ర‌ల్లో బ‌లం లేక‌పోవ‌డం ఇవ‌న్నీ సుస్ప‌ష్టంగా క‌నిపిస్తాయి. రాఘ‌వేంద్ర‌రావు వంటి సీనియ‌ర్ డైరెక్ట‌ర్.. త‌ను తెర‌కెక్కించి బ్లాక్ బ‌స్ట‌ర్ టైటిల్‌ను పెట్టుకున్న‌ప్పుడు అన్నీ జాగ్ర‌త్తలు తీసుకుంటాడ‌న‌పించింది. దీనికి తోడు స్క్రీన్ ప్లే పరంగా కూడా సినిమా ఏమాత్రం ఆకట్టుకునే విధంగా సాగలేదు. కథకు అవసరం లేని సీన్స్ ఎక్కువైపోయాయి.

pelli sandadi movie review in telugu

రాఘవేంద్రరావు.. కీర‌వాణి త‌మదైన స్టైల్లో పాట‌ల‌ను మాత్రం చ‌క్క‌గా తెర‌కెక్కించారు. ఏసంద‌ర్భంలోనూ సినిమా ఆడియెన్‌కు క‌నెక్ట్ కాదు.. ప్రకాశ్ రాజ్ పాత్ర‌ను తెర‌పై ఎలివేట్ చేసిన తీరు.. దాన్ని చివ‌రి వ‌ర‌కు తీసుకెళ్లిన తీరు చూస్తే ప్రేక్ష‌కుడి త‌ల తిరుగుతుంది. మొత్తానికి మేకర్స్ తాము అనుకున్న కంటెంట్ ను స్క్రీన్ మీద బాగా ఎలివేట్ చేయలేకపోయారు. సినిమాను ఇంట్రస్టింగ్ ఎలెమెంట్స్ తో ఆసక్తికరంగా మలచలేకపోయారు.

సినిమాలో సరైన ప్లో మిస్ అవ్వడం, ఓవరాల్ గా సినిమా స్లోగా సాగుతూ బోర్ కొట్టించడం.. వంటి అంశాలు సినిమా ఫలితాన్ని దెబ్బ తీశాయి. మొత్తమ్మీద ఈ సినిమా ఆకట్టుకోదు. నాటి పెళ్లి సంద‌డి స‌క్సెస్‌లో ఎమోష‌న్స్ కీ రోల్ పోషించాయి. కానీ నేటి ‘పెళ్లి సందD’లో పాత్ర‌ల మ‌ధ్య ఎమోష‌న్స్ క‌నిపించ‌వు.

 

 

Web Title: ‘పెళ్లి సందD’ రివ్యూ & రేటింగ్, pelli sandadi movie review in telugu, pelli sandadi review rating, pelli sandadi heroine sree leela, pelli sandadi telugu movie review

Previous articleవిష్ణు చేతుల మీదుగా నీకు నాకు పెళ్ళంట ట్రైలర్ విడుదల
Next articleRC17: Ram Charan Pan Indian film with Prashanth Neel