గోవాలో తీస్ మార్ ఖాన్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ

టాలీవుడ్ యంగ్ హీరో ఆది సాయి కుమార్ కథానాయకుడిగా నటిస్తోన్న తాజా చిత్రం “తీస్ మార్ ఖాన్ష‌. విజ‌న్ సినిమాస్ బ్యాన‌ర్‌పై నాగం తిరుప‌తి రెడ్డి ఈ చిత్రాన్ని ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మిస్తున్నారు. గ్లామరస్ హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ కథానాయికగా నటిస్తుంది.

హై యాక్షన్ వోల్టేజ్ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమా కి కళ్యాణ్ జి గోగణ దర్శకత్వం వహిస్తుండగా ఇటీవలే ఈ సినిమా ఫస్ట్ లుక్ విడుదల అయ్యి మంచి ప్రేక్షకాదరణ అందుకుంది. అంచనాలకు తగ్గట్లుగా ఈ లుక్ ప్రేక్షకులను బాగా అలరించింది. హీరో ఆది సాయి కుమార్ పవర్ ప్యాక్డ్ లుక్‌తో ప్రేక్షకులను ఆకట్టుకున్నారు.

మూడు వేరియేషన్స్ ఉన్న పాత్రలు పోషిస్తున్న సాయి కుమార్ ఈ పోస్టర్ లో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో కనిపించి అందరినీ అలరించారు. పాయ‌ల్ రాజ్‌పుత్ పాత్ర ఇప్ప‌టి వ‌ర‌కు ఆమె చేసిన చిత్రాల‌కు భిన్నంగా, ఇది వ‌ర‌కు చూడ‌ని స‌రికొత్త క్యారెక్ట‌ర‌రైజేష‌న్‌తో అటు గ్లామ‌ర్ ప‌రంగా, ఇటు పెర్ఫామెన్స్ ప‌రంగా ఆక‌ట్టుకోనుంది.

Payal Rajput, Aadi Sai Kumar's 'Tees Maar Khan' Shoot on in Goa

Also Read: RAPO19: రామ్‌ చిత్రంలో విలన్‌గా ఆది పినిశెట్టి

ప్ర‌స్తుతం ఈ సినిమా చిత్రీక‌ర‌ణ గోవాలో జరుగుతుంది. హీరో, హీరోయిన్స్‌పై మంచి రొమాంటిక్ సాంగ్‌ను చిత్రీక‌రిస్తున్నారు. ఆది సాయికుమార్ డాన్స్‌, పాయల్ రాజ్ పుత్ గ్లామర్ ఈ పాటకు ప్రధాన ఆకర్షణ కాగా సినిమా మొత్తానికి ఈ పాట హైలైట్ గా నిలవనుంది. త్వరలోనే ఈ సినిమా కి సంబంధించిన పూర్తి వివరాలు వెల్లడి చేయనున్నారు.

 

Web Title: Payal Rajput, Aadi Sai Kumar’s ‘Tees Maar Khan’ Shoot on in Goa, Tees Maar Khan cast crew, Tees Maar Khan movie shooting updates, Release date,

Related Articles

Telugu Articles

Movie Articles