ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సభ్యుల రాజీనామా

0
42
All winners from Prakash Raj’s panel to resign

Prakash Raj Panel Resigned: ఫలితాలు విడుదలైనప్పటికీ.. మా సభ్యులు ఒకరిపై మరోకరు ఆరోపణలు చేసుకుంటూనే ఉన్నారు. ఈ నేపథ్యం లోనే ప్రకాశ్‌ రాజ్‌ ప్యానెల్‌ సంచలన నిర్ణయం తీసుకుంది. ప్యానెల్‌ నుంచి గెలిచిన వాళ్లందరం రాజీనామా చేస్తున్నట్లు సినీ నటుడు ప్రకాశ్‌రాజ్‌ ప్రకటించారు.

ఎన్నికల్లో క్రాస్‌ ఓటింగ్‌ జరిగిందని అన్నారు. రెండు రోజుల నుంచి జరుగుతున్న ఘటనలపై తన ప్యానెల్‌ సభ్యులతో చర్చించినట్లు తెలిపారు. పోస్టల్‌ బ్యాలెట్‌లో అన్యాయం జరిగిందని ఆరోపించారు. ఎక్కడెక్కడి నుంచో మనుషులను తీసుకొచ్చారని అన్నారు.

ఇవాళ చేసిన తమ సభ్యుల రాజీనామాలను మంచు విష్ణు ఆమోదించాలని ప్రకాష్‌రాజ్ డిమాండ్‌ చేశారు. తెలుగు వాడు కానీ వాడు కూడా పోటీ చేయడానికి వీలు ఉంది అని మంచు విష్ణు హామీ ఇస్తే.. బై లాస్ మార్చమని చెబితే తన రాజీనామా వెనక్కి తీసుకుంటానని ప్రకటించారు ప్రకాష్‌రాజ్.

పదవులు లేకపోయినా విష్ణుకు అండగా ఉంటామని కథానాయకుడు శ్రీకాంత్‌ అన్నారు. ఎగ్జిక్యూటివ్‌ వైస్‌ ప్రెసిడెంట్‌గా ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌నుంచి విజయం సాధించిన ఆయన రాజీనామా చేశారు. సుదీర్ఘంగా జరిగిన చర్చల అనంతరం ఈ నిర్ణయం తీసుకున్నాం. గతంలో ఇలాగే కలిసి పనిచేసినప్పుడు విభేదాలు తలెత్తాయి.

All winners from Prakash Raj’s panel to resign

Also Read: ప్రకాష్ రాజ్ రాజీనామా పట్ల స్పందించిన మంచు విష్ణు

ప్రకాశ్‌రాజ్‌ ప్యానెల్‌ నుంచి ఉపాధ్యక్షుడిగా గెలుపొందిన బెనర్జీ కూడా తన పదవికి రాజీనామా చేశారు. ఎన్నికల్లో దూరంగా నిలబడ్డాను. ఒకవైపు మోహన్‌బాబుగారు తనీశ్‌ను తిడుతున్నారు. నేను విష్ణు దగ్గరకు వెళ్లి ‘గొడవలు వద్దు నాన్నా’ అని అన్నాను. అది విన్న మోహన్‌బాబుగారు కొట్టడానికి వచ్చేశారు. విష్ణుబాబు ఆయన్ను అడ్డుకుని నన్ను పక్కకు లాగేశారు. అసభ్య పదజాలంతో మోహన్‌బాబు తిట్టిపోశారు. వాళ్లకి భయపడుతూ ఉండటం కంటే రాజీనామా చేయటం మంచిది’’ అని బెనర్జీ కంటతడి పెట్టుకున్నారు.

 

 

Web Title: Maa Elections Results, All Prakash Raj Panel Resigned to Maa, Prakash Raj about Vishnu comments, Mohan babu comments on Chiranjeevi, All winners from Prakash Raj’s panel to resign!

SOURCEEenadu
Previous articleSai Tej Republic 10 Days collections
Next articleActress Hamida Latest Stills