‘పుష్ప ది రైజ్’ షూటింగ్ అప్‌డేట్..!

0
177
Allu Arjun Pan India Movie Pushpa Shooting Latest Updates

Pushpa Shooting Update: ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న పాన్ ఇండియా మూవీ ‘పుష్ప‌’. రెండు భాగాలుగా తెర‌కెక్క‌నున్న ఈ సినిమా తొలి భాగం ‘పుష్ప ది రైజ్‌’ను డిసెంబ‌ర్ 17న విడుద‌ల చేయ‌బోతున్న‌ట్లు ప్ర‌క‌టించారు.

ప్రస్తుతం చిత్రీకరణ దశల్లో ఉన్న చిత్రాల్లో భారీ బజ్ ఉన్న సినిమాగా పుష్ప గురించి చెప్పుకోవచ్చు. ఈ చిత్రాన్ని ప్యాన్ ఇండియా లెవల్లో మొత్తం ఐదు భాషల్లో విడుదల చేయనున్నారు. పుష్ప ది రైజ్ టాకీ పార్ట్ షూటింగ్ దాదాపుగా పూర్తయ్యిందిట.

ఇంకా మూడు పాటలను మాత్రమే చిత్రీకరించాలని తెలుస్తోంది. త్వరలోనే ఈ మూడు పాటల షూటింగ్ ను మొదలుపెట్టి నవంబర్ మిడ్ వీక్ కు షూటింగ్ ను మొత్తాన్ని అవగొట్టాలని సుకుమార్ భావిస్తున్నాడు. విదేశాల్లో ఈ పాట‌ల‌ను పూర్తి చేసేలా ప్లాన్ చేశార‌ట డైరెక్ట‌ర్ సుకుమార్.

Allu Arjun Pan India Movie Pushpa Shooting Latest Updates

రంగ స్థ‌లం వంటి బ్లాక్ బ‌స్ట‌ర్ త‌ర్వాత సుకుమార్ ద‌ర్శ‌క‌త్వంలో వ‌స్తున్న సినిమా కూడా కావ‌డంతో సినీ వ‌ర్గాలు ఆస‌క్తిగా పుష్ప ది రైజ్ కోసం వేచి చూస్తున్నారు. ఇప్పటికే విడుదలైన రెండు పాటలు దాక్కో దాక్కో మేక, శ్రీవల్లి సాంగ్స్ మంచి రెస్పాన్స్ ను తెచ్చుకున్నాయి.

 

Web Title: Allu Arjun Pan India Movie Pushpa Shooting Latest Updates, Pushpa The Rise updates, Pushpa release date, Pushpa HD images, Pushpa Songs. Rashmika Mandanna

Previous articleAmala Paul Latest Images
Next articleమరోసారి ‘సలార్’ నుంచి ఫుటేజ్ లీక్..!