ఈడీ ముందు విచారణకు హాజరైన అనన్య పాండే

0
73
Liger Heroine Ananya Panday's Questioning By Anti-Drug Agency

Ananya Pandey Drug Case: అనన్య పాండేను గురువారం రెండు గంటల పాటు నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (NCB) విచారించింది, ఆమె ముంబై ఇంటిపై దాడి చేసింది మరియు డ్రగ్స్-ఆన్-క్రూయిజ్ కేసులో దర్యాప్తులో ఆమె ల్యాప్‌టాప్ మరియు మొబైల్ ఫోన్ కూడా స్వాధీనం చేసుకుంది, ఇందులో ఆర్యన్ ఖాన్ మరియు ఇతరులు అరెస్టయ్యారు.

సాయంత్రం 4 గంటల సమయంలో ఏజెన్సీ కార్యాలయానికి చేరుకున్న అనన్య పాండే. కొన్ని రోజులుగా ఆమె పేరు కూడా ఈ కేసులో స్కానర్ లో ఉందని ఎన్‌సిబి వర్గాలు తెలిపాయి. అంతేకాదు ఆర్యన్ ఖాన్, అనన్య మధ్య జరిగిన వాట్సప్ చాట్ లో ఫుట్ బాల్ పేరుతో చాటింగ్ జరిగిందని, కానీ అది కోడ్ లాంగ్వేజ్ లో ఉందని తెలుస్తోంది.

అనన్య కేసు ఆర్యన్ ఖాన్ విషయంతో ముడిపడి ఉందో లేదో ఎన్‌సిబి ఇంకా నిర్ధారించలేదు. కాగా అక్టోబర్ 26 న ఆర్యన్ ఖాన్ బెయిల్ పిటిషన్‌పై బాంబే హైకోర్టు విచారణ జరుపుతుంది.

Liger Heroine Ananya Panday's Questioning By Anti-Drug Agency

ఇదిలా ఉండగా క్రూయిజ్ డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన ఎనిమిది మంది నిందితులతో పాటు ఆర్యన్, అర్బాజ్‌ల జ్యుడీషియల్ కస్టడీని అక్టోబర్ 30 వరకు ప్రత్యేక కోర్టు పొడిగించింది.

 

 

Web Title: Liger Heroine Ananya Panday’s Questioning By Anti-Drug Agency, Ananya Panday Drug case, Vijay Devarakonda heroine, Ananya Panday Movies

Previous article‘ఎఫ్ 3’ షూటింగ్ లో జాయిన్ అయిన సోనాల్ చౌహాన
Next articleRavi Teja Khiladi shooting in Dubai