సోషల్ మీడియాలో అనుపమ రచ్చ..!

0
243
Anupama Parameswaran Shocking Reply On Asking Bikini Photos

Anupama Parameswaran: సెలబ్రిటీలంతా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటారు. తమ వ్యక్తిగత, సినిమా విశేషాలను పంచుకుంటూ ఉంటారు. కేరళ బ్యూటీ అనుపమ పరమేశ్వరన్ తెలుగు ప్రేక్షకులకు బాగానే దగ్గరైంది. అ ఆ, శతమానంభవతి వంటి చిత్రాలతో అందరినీ కట్టిపడేసింది.

ఎప్పుడూ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే అనుపమ పరమేశ్వరన్ తాజాగా ఇన్స్టాగ్రామ్ లో నెటిజన్లతో ముచ్చటించింది. ఈ సందర్భంగా వారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెప్పుకొచ్చింది. అందులో నెటిజన్లు రకరకాల ప్రశ్నలు సంధించారు. అయితే అందులో దాదాపు రెగ్యులర్ క్వశ్చన్స్ ఉన్నాయి.

అయితే ఓ నెటిజన్ మాత్రం చిరాకు తెప్పించినట్టున్నాడు. బికినీలో ఉన్న ఫోటోను పంపు అని అడిగేశాడు. దీనికి అనుపమ అదిరిపోయే కౌంటర్ ఇచ్చింది. దానికి అనుపమ స్పందిస్తూ.. ‘నీ అడ్రెస్ పంపించు. ఫొటో పంపిస్తాను. ఫ్రేమ్ కట్టించి ఇంట్లో పెట్టుకో’ అంటూ తనదైన శైలిలో కౌంటర్ వేసింది.

Anupama Parameswaran Shocking Reply On Asking Bikini Photos

Also Read: Anupama Parameswaran: ప్రేమించాను.. కానీ బ్రేకప్‌

మొత్తానికి అనుపమ ఆ ప్రశ్న ఎదురవ్వడంతో అసహనానికి ఫీలైనట్టు కనిపిస్తోంది. ప్రస్తుతం ఈ బ్యూటీ ’18 పేజెస్’, ‘రౌడీ బాయ్స్’ వంటి సినిమాల్లో నటిస్తోంది.

 

 

Web Title: Anupama Parameswaran Shocking Reply On Asking Bikini Photos

Previous articleDhanush’s wife Aishwarya announces her next in Telugu Film
Next articleKamal Haasan’s ‘Vikram’ second schedule wrapped