గాడ్‌ ఫాదర్‌ కోసం తమన్‌ ప్లానింగ్ సూపర్..!

0
301
Britney Spears to croon for Chiranjeevi upcoming film Godfather

Thaman GodFather: మెగాస్టార్‌ చిరంజీవి వరుస సినిమాలతో దూసుకుపోతున్నారు. ప్రస్తుతం మెగాస్టార్‌ చేతిలో ఏకంగా మూడు సినిమాలున్నాయి. కొరటాల శివ దర్శకత్వం వహిస్తున్న ‘ఆచార్య’ చిత్రం విడుదలకు సిద్ధంగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సినిమాతో పాటు… మోహన్‌ రాజా దర్శకత్వంలో లూసిఫర్ రీమేక్ లో తెరకెక్కుతోన్న ‘గాడ్‌ ఫాదర్‌’ లో కూడా నటిస్తున్నారు.

దీని తరువాత బాబీ డైరెక్షన్ లో ఓ సినిమా, అలానే మెహర్ రమేష్ దర్శకత్వంలో ‘భోళా శంకర్’ సినిమాలు చేయబోతున్నారు. ఇప్పటికే ‘గాడ్ ఫాదర్’ సినిమాకి సంబంధించిన అప్డేట్స్ వరుసగా బయటకొస్తున్నాయి. ఈ సినిమాకు సంగీత దర్శకత్వం వహిస్తున్న తమన్‌ తీసుకున్న నిర్ణయంతో … దేశ వ్యాప్తంగా ఈ సినిమా గురించి చర్చించుకుంటున్నారు.

ఇందులో పాటలకు మరింత హైప్ క్రియేట్ చేయడానికి హాలీవుడ్ పాప్ సింగర్ ను రంగంలోకి దించబోతున్నాడట తమన్. బ్రిట్నీ స్పియర్స్ తో ఓ పాట పాడించాడని తమన్ ప్లాన్ చేస్తున్నట్లు సమాచారం.

Britney Spears to croon for Chiranjeevi upcoming film Godfather

Also Read: పుష్ప నుండి శ్రీవల్లి సాంగ్: DSP, సిద్ శ్రీరామ్ మ్యాజిక్ 

ఈ మేరకు బ్రిట్నీ స్పియర్స్ తెలుగులో పాట పాడేందుకు ఒప్పుకుంటారా లేదా అని అధికారిక ప్రకటన వచ్చే వరకు వేచి చూడక తప్పదు. ఇదే నిజమైతే ‘గాడ్ ఫాదర్’ మేకర్స్ ఆమెకి భారీ రెమ్యునరేషన్ ఇవ్వాల్సి ఉంటుంది.

 

 

Web Title: Britney Spears to croon for Chiranjeevi upcoming film Godfather, Thaman, Britney Spears to collaborate with Thaman for GodFather movie

Previous articleActress Sivatmika Rajasekhar Latest Photos
Next articleMost Eligible Bachelor Pre Release Business and Box office target