రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ .. ఓటీటీ ఆఫర్ కు మెగాస్టార్ నో..!

0
2090
Chiranjeevi Rejected two OTT web series offers

Chiranjeevi OTT Offer: ప్రస్తుతం డిజిటల్ ప్లాట్‌ఫార్మ్స్‌కు పెరుగుతున్న క్రేజ్ చూసి సీనియర్, జూనియర్ అని తేడా లేకుండా నటీనటులంతా వాటివైపు అడుగులు వేస్తున్నారు. కానీ కొందరు హీరోలు మాత్రం వెండితెరకే పరిమితమవుతున్నాయి. అందులో మెగాస్టార్ చిరంజీవి కూడా ఒకరు.

మెగాస్టార్ చిరంజీవి వరుసగా సినిమాలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో పాటు టాలెంట్ ఉన్న డైరెక్టర్లకు తన సినిమాలకు దర్శకత్వం వహించే ఛాన్స్ ఇస్తున్నారు. ఇప్పటికే ప్రకటించిన సినిమాలను వేగంగా పూర్తి చేయాలని చిరంజీవి భావిస్తున్నారు.

అయితే తాజాగా ఒక వెబ్ ఫిల్మ్‌లో నటించడానికి మెగాస్టార్ చిరంజీవిని సంప్రదించిందట పేరున్న ఓటీటీ సంస్థ. కేవలం 25 రోజుల కాల్ షీట్స్‌ను మాత్రమే వారు కోరారట. కానీ చిరంజీవి ఆ ఆఫర్‌ను తిరస్కరించినట్లుగా తెలుస్తోంది. నిర్మాతలు రికార్డు స్థాయిలో రెమ్యునరేషన్ ను ఆఫర్ చేసినా తన ప్రాధాన్యత బిగ్ స్క్రీన్స్ కు మాత్రమే అని చెప్పడానికి చిరంజీవి ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది.

Chiranjeevi Rejected two OTT web series offers

Also Read: 1970 బ్యాక్‌డ్రాప్‌ లో ప్రభాస్ సలార్‌ మూవీ…?

చిరంజీవిని ఒక వెబ్ సిరీస్‌లో కీలక పాత్ర చేయాలని రిక్వెస్ట్ చేసిందట ఆ ఓటీటీ సంస్థ. దానికి కూడా చిరు ఎస్ చెప్పలేదట. అయితే కథ నచ్చినా చర్చల సమయంలోనే చిరంజీవి ఆ ఆఫర్ కు నో చెప్పారు. కానీ చిరు ఫ్యాన్స్ మాత్రం బాస్ డిజిటల్ ఎంట్రీ ఎప్పుడా అని ఎదురుచూస్తున్నారు.

 

 

Web Title: Chiranjeevi Rejected two OTT web series offers,  Chiranjeevi huge remuneration for OTT series, Chiranjeevi Upcoming movies 2022,

Previous articleఇది రాజకీయ వేదిక కాదు.. కళాకారుల వేదిక: మోహన్ బాబు
Next articleవిద్యాసంస్థకు బ్రాండ్ అంబాసిడర్ గా అల్లు అర్జున్