సాయిధ‌ర‌మ్ తేజ్‌తో ఫొటోను షేర్ చేసిన చిరంజీవి..!

0
74
Chiranjeevi Shared Sai Dharam Tej photo after bike accident

Sai Dharam Tej New Photo: బైక్ యాక్సిడెంట్‌కు గురైన నటుడు సాయి ధరమ్ తేజ్ పూర్తిగా కోలుకుని ఇప్పుడు తిరిగి వచ్చారు. మెగాస్టార్ చిరంజీవి ఈ ఫోటోలు షేర్ చేస్తూ మా కుటుంబ సభ్యులందరికీ ఇది నిజమైన పండుగ అని చెప్పుకొచ్చారు.

ఈ ఫోటోలో మెగాస్టార్ తో పాటు సాయి ధరమ్ తేజ్, పవన్ కల్యాణ్, నాగబాబు, అల్లు అర్జున్, వరుణ్ తేజ్, వైష్ణవ్ తేజ్, పవన్ తనయుడు అకీరా నందన్‌లు ఉన్నారు. దీనిపై సాయి ధరమ్‌ తేజ్‌ కూడా ట్విట్టర్ వేదికగా స్పందించారు.

“నా పునర్జన్మకి కారణమైన మీ ప్రేమకి మీ ప్రార్థనలకు ఏమిచ్చి రుణం తీర్చుకోగలను. మీ ప్రేమ పొందడం నా పూర్వజన్మ సుకృతం” అని సాయి ధరమ్‌ తేజ్ ట్వీట్‌ చేశారు. కొన్ని రోజులు ముందు బైక్ యాక్సిడెంట్ కి గురైన తర్వాత ఆస్పత్రి నుంచి పూర్తి ఆరోగ్యంతో డిశ్చార్జ్ అయిన సాయి తేజ తొలిసారి దీపావళి ఫ్యామిలీ ఫంక్షన్ లో పాల్గొన్నారు.

Also Read: త‌ప్పుడు వార్త‌లు రాసే వారికి హరీష్ శంకర్ షాకింగ్ ట్వీట్..!

Chiranjeevi Shared Sai Dharam Tej photo after bike accident

ఈ ఫోటో చూసిన ఫ్యాన్స్ అందరూ సంతోషంతో మునిగిపోయి SDT ఇస్ బ్యాక్ అంటూ ఈ ఫోటోని వైరల్ చేశారు.

 

Web Title: Chiranjeevi Shared Sai Dharam Tej photo after bike accident, Diwali special mega heroes photo, Sai Dharam Teja latest pics, Sai Teja is back viral pic.

Previous articleRRR Second Song Poster: Mass Number Naatu Naatu
Next articleChiranjeevi Mega 154 Moolaviraat Darshanam: Araachakam