విజయ్‌పై దిల్ రాజు కామెంట్స్ వైరల్ ..!

0
1121
Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan

Dil Raju, Vijay Devarakonda: ఆశీష్ హీరోగా రాబోతోన్న రౌడీ బాయ్స్ సినిమాను ఓ రేంజ్‌లో ప్రమోట్ చేస్తున్నాడు దిల్ రాజు. ఈ మూవీ నుంచి ప్రేమే ఆకాశం అంటూ సాగే పాటను బుధవారం విడుదల చేశారు. దీని కోసం ప్రత్యేకంగా ఓ ఈవెంట్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హీరో విజయ్ దేవరకొండ హాజరయ్యాడు.

విజయ్‌తో ఉన్న రిలేషన్, జర్నీ గురించి దిల్ రాజు చెప్పుకొచ్చాడు. రౌడీ బాయ్స్ మూవీకి ఈ టైటిల్ పెట్టేందుకు విజయ్ నుంచి పర్మిషన్ తీసుకున్నట్లు దిల్ రాజు తెలిపాడు. తెలుగు ఇండస్ట్రీకి విజయ్ రూపంలో మరో పవన్ కళ్యాణ్ దొరికాడని కొనియాడాడు. అతి తక్కువ సమయంలోనే ఇంత స్టార్డం వచ్చింది. అలా పవన్ కళ్యాణ్ గారికి వచ్చింది. విజయ్‌కి ఓ నాలుగు సినిమాలకే వచ్చింది.

ఇది మా ఈవెంట్ అయినా కూడా నీ గురించి మాట్లాడాల్సిన బాధ్యత ఉంది. కేరింతకు ఫోటో షూట్ చేసి నా దగ్గరే పెట్టుకున్నాను. ఇంకా నీతో సినిమా చేయలేదు. ఏలాగూ చేస్తున్నాం. అనంతరం అతడు నటించిన పెళ్లిచూపులు సినిమాను తనకు చూపించాలని ట్రై చేయగా.. ఆ సమయంలో తాను ఆస్ట్రేలియాలో ఉండటంతో కుదరలేదన్నాడు.

Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan

ఆ తర్వాత విజయ్ నటించిన అర్జున్ రెడ్డి, గీత గోవిందం సినిమాలు చూశానని తెలిపాడు. నాలుగు సినిమాలతోనే స్టార్‌గా ఎదగడం, లైగర్‌తో పాన్ ఇండియన్ హీరోగా మారుతున్నావ్ ఆల్ ది బెస్ట్. అడగ్గానే మా ఈవెంట్‌కు వచ్చినందుకు థ్యాంక్స్’ అని అన్నారు.

 

 

Web Title: Dil Raju Comments on Liger Vijay Devarakonda, Dil Raju Compares Vijay Devarakonda With Pawan Kalyan, Rowdy Boys song release event,

Previous articleయూట్యూబ్ ఛానళ్ల పై సమంత కేసు రిజిస్టర్..!
Next articleAnupama Parameswaran Photos From Rowdy Boys Event