“దృశ్యం 2″ నిర్మాతలపై లీగల్ యాక్షన్ కు ఓటిటి సిద్ధం..?

0
3813
Disney plus hotstar OTT legal action on Venkatesh Drushyam 2 producer
Disney plus hotstar OTT legal action on Venkatesh Drushyam 2 producer

Venkatesh Drushyam 2: వెంకటేష్ తాజా చిత్రం దృశ్యం 2 వచ్చే వారం అమెజాన్ ప్రైమ్‌లో (Amazon Prime OTT) విడుదల కానుంది. మేకర్స్ ప్రమోషన్లు కూడా ప్రారంభించారు. సినిమా గురించి దగ్గుబాటి ప్రేక్షకులంతా ఎంతో ఆతృతగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దృశ్యం కి సీక్వెల్ గా వస్తోంది.

అయితే లేటెస్ట్ అప్డేట్ ఏంటంటే, వెంకటేష్ దృశ్యం2 ప్రొడ్యూసర్స్ పైన చేయటానికి ఈ సంస్థ సన్నాహాలు చేస్తున్నట్లు తెలుస్తోంది. మొదట ఈ సినిమాని డిస్నీ ప్లస్ హాట్ స్టార్ లో రిలీజ్ చేయటానికి డీల్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఇప్పుడు అమెజాన్ ప్రైమ్ పోటీలో రిలీజ్ చేస్తున్నట్టు అనౌన్స్ చేశారు.

ఇప్పుడు, అమెజాన్‌తో ఒప్పందం చేసుకునే ముందు హాట్‌స్టార్‌తో తమ డీల్‌ను రద్దు చేసుకోకపోవడంతో డిస్నీ హాట్‌స్టార్ మేకర్స్‌తో అసంతృప్తిగా ఉన్నారు. కాబట్టి, రాబోయే రోజుల్లో చట్టపరమైన చర్యలు తీసుకోవాలని వారు చూస్తున్నట్టు సమాచారం అందుతుంది.

Disney plus hotstar OTT legal action on Venkatesh Drushyam 2 producer
Disney plus hotstar OTT legal action on Venkatesh Drushyam 2 producer

దృశ్యం 2 చిత్రంలో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రలు పోషించారు. ఈ సినిమాకి సురేష్ బాబు ప్రొడ్యూసర్ గా ఉన్నారు. మరి ఇందులో నిజం ఎంత ఉంది అనే విషయం తెలియాలంటే మేకర్స్ స్పందించాల్సిందే.

 

Previous articleమిస్టర్ లోన్లీ మూవీ రివ్యూ & రేటింగ్ !!!
Next articleKalyanram Condemns Personal Attack On NCBN