Heroine SreeLeela: పెళ్లిసండD సినిమాతో హీరోయిన్ గా పరిచయం అయిన ముద్దుగుమ్మ శ్రీలీల. తెలుగు మూలాలు ఉన్న అమ్మాయిగా ఈమె మీడియాలో నిలిచింది. టాలీవుడ్ ఇండస్ట్రీని హీరోయిన్ల కొరత వేధిస్తున్న నేపథ్యంలో కృతిశెట్టి స్థాయిలో శ్రీ లీలకు కూడా ఆఫర్లు వచ్చే ఛాన్స్ అయితే ఉందని తెలుస్తోంది.
తెలుగు లో ఈ అమ్మడికి తాజాగా రవితేజ సరసన నటించే అవకాశం వచ్చింది. ఆ సినిమాకు త్రినాధ రావు నక్కిన దర్శకత్వం వహించబోతున్నాడు. రెండవ సినిమా కు ఓకే చెప్పిన శ్రీలీలా మరో రెండు సినిమా లు ఓకే అయ్యాయి అంటూ వార్తలు వస్తున్నాయి.
వరుణ్ కు జోడీగా నటిస్తే మరి కొందరు యంగ్ హీరోలకు జోడీగా నటించే ఛాన్స్ శ్రీ లీలకు దక్కే అవకాశం ఉంది. వరుణ్ తేజ్ మూవీ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కనుండగా ఈ సినిమాకు ప్రముఖ దర్శకుడు వెంకీ కుడుముల దర్శకత్వం వహించనున్నారు. ఈ సినిమాలో ఒక హీరోయిన్ గా శ్రీలీల నటించనుండగా మరో హీరోయిన్ కు సంబంధించిన వివరాలు తెలియాల్సి ఉంది.
వరుణ్ ప్రస్తుతం నటిస్తున్న గని స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కగా ఈ సినిమాపై భారీగా అంచనాలు ఏర్పడ్డాయి. మెగా మూవీలో నటించిన తర్వాత అమ్మడి క్రేజ్ అమాంతం పెరగడం ఖాయం. తద్వారా టాలీవుడ్ లో ఈమెకు టాప్ హీరోయిన్ ల జాబితాలో ఛాన్స్ దక్కడం కూడా ఖాయం. వరుసగా సినిమాలు చేసే అవకాశాలు వస్తున్నా కూడా ఆచితూచి సినిమాలను ఈ అమ్మడు ఎంపిక చేసుకుంటూ ఉంది.