Hyper Aadi Manchu Vishnu: ట్రెండ్‌కు తగ్గట్టుగా కౌంటర్లు వేస్తుంటారు హైపర్ ఆది. దీపావళి సందర్భంగా ఈటీవీలో ‘తగ్గేదేలే’ స్పెషల్ ప్రోమో విడుదల చేశారు. ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించేందుకు ‘జబర్దస్త్’ కమెడియన్లు ఆది, ఆటో రాంప్రసాద్, చంటీ తదితరులు ప్రత్యేక స్కిట్లతో ముందుకొస్తున్నారు.
చివర్లో ఆది.. రోజాతో వాదిస్తూ.. ‘‘అన్నీ మీకు తెలిసినట్లే మాట్లాడుతున్నారేంటీ? ఇందాక ప్రియమణిగారు మా సైడుకు వచ్చి ఏం మాట్లాడారో తెలుసా మీకు?’’ అని ఆది అన్నాడు. దీంతో రోజా ఏమన్నారని ఆదిని అడిగారు. ఆది ఆవేశపడుతూ.. ఏదో చెప్పబోతుండుగా.. పక్కనున్నవారు అతడిని వారించారు. దీంతో ఆది ‘‘లేట్ దెమ్ నో అంకుల్.. లెట్ దెమ్ నో అంకుల్’’ అన్నాడు.
ఇటీవల ‘మా’ ఎన్నికల్లో మంచు విష్ణు తన ప్రసంగాల్లో ఎక్కువగా వాడిన పదం అంకుల్. లెట్ దెమ్ నో అంకుల్ అంటూ ఎక్కువగా వాడేశాడు. ఇలా మంచు విష్ణు నాడు సోషల్ మీడియాలో ఎదుర్కొన్న ట్రోలింగ్లపై తాజాగా హైపర్ ఆది సెటైర్లు వేశాడు.
Also Read: గోవాలో తీస్ మార్ ఖాన్ రొమాంటిక్ సాంగ్ చిత్రీకరణ
మొత్తానికి మంచు విష్ణు మీద వచ్చిన ట్రోల్స్ మాత్రం ఫుల్లుగానే వైరల్ అవుతున్నాయి. మరి ఆది పంచులకు మంచు విష్ణు రియాక్షన్ ఎలా ఉంటుందో చూడాలి. లేదు అంటే కామెడీ స్క్రిప్ట్ కదా అని వదిలేస్తాడు ఏమో చూడాలి.