కార్తికేయ ‘రాజా విక్ర‌మార్క‌’ విడుదల డేట్ ఫిక్స్

0
131
Raja Vikramarka Locks Release For November 12th

Raja Vikramarka Release date: యాక్షన్ ప్లస్ కామెడీతో నయా ఏజెంట్ విక్రమ్ పాత్రలో మన ఆడియ‌న్స్‌ను ఎంట‌ర్‌టైన్ చేయ‌డానికి కార్తికేయ గుమ్మకొండ రెడీ అయ్యారు. ఆయన హీరోగా నటించిన స్పై యాక్షన్ ఎంటర్టైనర్ ‘రాజా విక్రమార్క’. నేడు ఈ చిత్ర విడుదల తేదీని ప్రకటించారు. నవంబర్ 12వ తేదీన రాజావిక్రమార్క చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ విడుదల చేశారు.

శ్రీ చిత్ర మూవీ మేకర్స్ పతాకంపై ఆదిరెడ్డి .టి సమర్పణలో ’88’ రామారెడ్డి నిర్మించారు. ప్రముఖ దర్శకుడు వి.వి. వినాయక్ శిష్యుడు శ్రీ సరిపల్లి దర్శకుడిగా పరిచయం అవుతున్నారు. సినిమా ఫస్ట్ కాపీ రెడీ అయ్యింది. నవంబర్ 12న థియేటర్లలో విడుదల చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు.

ప్రశాంత్ ఆర్ విహారి సంగీతం అందిస్తున్నారు. కార్తికేయకు జంటగా తాన్యా రవిచంద్రన్ నటిస్తున్నారు. ఈ సినిమాలో సుధాకర్ కోమాకుల, సాయికుమార్, తనికెళ్ళ భరణి, పశుపతి, హర్షవర్ధన్, సూర్య, జెమిని సురేష్, జబర్దస్త్ నవీన్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు.

Raja Vikramarka Locks Release For November 12th

Also Read: Karthikeya Birthday First Look From Ajith Valimai Film

మరోవైపు స్టార్ హీరోల సినిమాలలో విలన్ రోల్స్ చేస్తున్నాడు. Ajith లేటెస్ట్ యాక్షన్ ఎంటర్టైనర్ valimai లో కార్తికేయ నెగిటివ్ రోల్ చేస్తున్నారు. ఈ చిత్రంలో ఆయన బైక్ రేసర్ లా కనిపిస్తుండగా, సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

 

Web Title: karthikeya next Raja Vikramarka release date locked, Raja Vikramarka Locks Release For November 12th. Tanya Ravichandran, karthikeya upcoming movies.

Previous article15 నిమిషాల క్లైమాక్స్ కి 50 కోట్లు ఖర్చు..!
Next articleKonda Polam OTT Release Date Confirmed