NTR30, Koratala Siva: 2018లో భరత్ అను నేను వంటి అద్భుతమైన హిట్‌ని అందించిన దర్శకుడు కొరటాల శివ మెగాస్టార్ చిరంజీవితో తన తదుపరి చిత్రాన్ని రూపొందించడానికి చాలా కాలం పట్టింది. ‘ఆచార్య’ (Acharya) ప్రారంభించడానికి ఎక్కువ సమయం తీసుకున్నప్పటికీ, కరోన కారణంగా, ఈ సినిమా ఫిబ్రవరి 2022లో విడుదల అవుతుంది.
కొరటాల శివ ఆచార్యపై తన పనిని పూర్తి చేసి ఫైనల్ కాపీని పూర్తిగా సిద్ధం చేసినట్లు సమాచారం వస్తున్నాయి. ఇంకా సినిమా ఫిబ్రవరిలో రిలీజ్ కానున్న ప్రమోషన్ వర్క్ ఇప్పుడే స్టార్ట్ కాదు కాబట్టి, శివ తన తర్వాత ఎన్టీఆర్ (NTR30) సినిమా అయినా ప్రొడక్షన్ వర్క్ స్టార్ట్ చేసినట్టు తెలుస్తుంది. ఇప్పుడు ఈ సినిమా కోసం బౌండ్ స్క్రిప్ట్ సిద్ధమవుతుండగా ఇందు కోసం ముగ్గురు హేమాహేమీ రచయితలు రంగంలోకి దిగారు.
ఫైనల్ వెర్షన్ తాలూకు కొన్ని సీన్స్ పై చర్చలు, మార్పులు జరుగుతున్నాయట. ఇందు కోసం రచయితలు శ్రీధర్ సీపాన, వేమా రెడ్డిలతో పాటు సీనియర్ రైటర్ సత్యానంద్ కూడా తోడయ్యారు. ఎన్టీఆర్ RRR మూవీ లో బిజీగా ఉండటం వలన, డిసెంబర్లో షూటింగ్ స్టార్ట్ చేయడం కష్టమని తెలుస్తోంది. అయినప్పటికీ కొరటాల మెయిన్ సన్నివేశాలు కాకుండా మిగతా సన్నివేశాల్ని షూట్ చేస్తారని తెలుస్తోంది.
ఈ సినిమాను ఎన్టీఆర్ ఆర్ట్స్, యువ సుధ ఆర్ట్స్ సంస్థలు సంయుక్తంగా నిర్మించనుండగా మరోవైపు ఈ సినిమా కోసం కొరటాల నటీనటులను కూడా ఎంపిక చేస్తున్నాడు. ఈ సినిమాలో హీరోయిన్ గా బాలీవుడ్ భామలు అలియా భట్, కియారా అద్వానీలతో పాటు పూజ హెగ్డేల పేర్లు వినిపిస్తున్నాయి.